ప్రియమైన "నీకు"
నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ....
నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే 'నిన్ను ప్రేమిస్తున్నా' అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.
మౌనం మాట్లాడితే లిపి లేని మాటలెన్నో ,
కాలం కాసేపు ఆగితే కనపడని కలతలెన్నో,
గతానికి గడువునిస్తే మరపురాని గుర్తులెన్నో,
కమ్మని కల వస్తే నిద్రించిన రాత్రులెన్నో,