Showing posts with label Vasantha Rao N. Show all posts
Showing posts with label Vasantha Rao N. Show all posts

Wednesday, April 4, 2018

మనకవితలు టీమ్

మాతృభాష మాధుర్యం! ( MATRU BHASHA telugu kavithalu on village)మాతృభాష మాధుర్యం!

భరత ఖండమందు తెలుగు రాష్ట్రమ్ములో
తెలుగు తల్లి పాలు లెస్స త్రాగి
అమృతమ్మువంటి “అమ్మ” పదము మరచి
“మమ్మి”యనుచు లెస్స తిరిగినావు

రెక్కలొచ్చిన పక్షి ఎగిరిపోయిన రీతి
విత్తంబు కోసమై విదేశాలకేగి
ఉద్యొగంబులేక ఊడిగాలు చేసి
మాతృ భాషనేమొ మరచినావు
Read More

Wednesday, March 21, 2018

మనకవితలు టీమ్

విద్యార్థీ మేలుకో ! ( VIDHYARDHI MELUKO TELUGU KAVITHALU ABOUT STUDENTS )విద్యార్థీ మేలుకో! విద్య విలువ తెలుసుకో!!
బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకో

విద్యార్థీ లేవరా కనులు తెరచి చూడరా
నీదూ హస్తంబులలో విశ్వభవిత గలదురా

క్లాసులోన పాఠాలను శ్రద్దగ నువు వినుమురా
ఇంటికొచ్చినాక మరల తిరగవేసి చూడరా

నిన్నునిండ ముంచునిద్ర మర్మమేదొ దెలియరా
నిత్యం నువు జాగ్రత్తతొ నిద్ర మేల్కొమ్మురా
Read More

Thursday, March 15, 2018

మనకవితలు టీమ్

జీవితం ( JEEVITAM telugu kavithalu on life )
జీవిత పరమార్థం...

అనంత కాలచక్రంలో
జీవితకాలం అల్పమే ఐనా
శతకోటి సుగంధాల
పరిమళమాల జీవితం

ఉత్సాహంగా పనిచేస్తూ
ఆనందంగా జీవిస్తూ
సాటివారికి సాయం చేయడమే
సరియైన జీవితం

సద్భావనలు పెంచుకొని
సన్మార్గాన పయనిస్తూ
సమత, మమత, మానవతలు
పరిఢవిల్లేదే జీవితం
Read More

Friday, January 26, 2018

మనకవితలు టీమ్

ఊహా సుందరి! ( UHAA SUNDARI DREAM GIRL TELUGU KAVITHALU )సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో . . ,
అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో . . .

అవనిలోని అందమంత అమరిన జవరాలివో . . ,
రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో . . .

ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో . . ,
శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో . . .
Read More

Monday, December 25, 2017

మనకవితలు టీమ్

దివ్యుడా! కనువిప్పుకో!! అందమైన తెలుగు కవితలు తెలుగులో ( ANDAMAINA TELUGU KAVITHALU )
దివ్యుడా! కనువిప్పుకో!!


ఆత్మవీర లేవర! అజ్ఞాన పథము వీడరా!
సకల జీవరాసులలో స్వామిని దర్శించరా!

బుల్లిబుల్లి నడకలతో బాల్యమంత గడిచిపోయె
చిట్టిచిట్టి మాటలతో చిరుప్రాయం కరిగిపోయె

విద్య ఉద్యోగమంటు విదేశాలకేగినావు
ఉద్యోగం దొరకదాయె ఊడిగాలు తప్పవాయె

డాలర్లు, యూరోలు, పౌండ్లెన్నొ పంపినావు
ముదుసలైనతల్లిదండ్రలవృద్ధాశ్రమాల జేర్చినావు
Read More

Saturday, December 23, 2017

మనకవితలు టీమ్

ఒక్క మొక్క నాటండి తెలుగు పర్యావరణ సంరక్షణ కవితలు ( TELUGU PARYAVARANA RAKSHANA KAVITHALU )ఒక్క మొక్క నాటండి!అన్నలార అక్కలార ఒక్కమొక్క నాటండి
చెట్టుచేసె మేలేమిటొ ఈజగతికి చాటండి

మొక్కపెట్టి మట్టివేసి నీరుపోసి కంచెవేసి
చంటిపాప వలెనుదాన్ని సతతం కాపాడండి

ఊరువాడ పట్నమంత ఉప్పెనలా కదలండి
ఉరకలేస్తు మొక్కనాటి ఉత్తేజం పెంచండి
Read More

Thursday, December 21, 2017

మనకవితలు టీమ్

దివ్య ప్రపంచం ! ( TELUGU POEM ABOUT TODAY'S GENERATION, TECHNOLOGY AND SOCIAL MEDIA )దివ్య ప్రపంచం !

నేటి ప్రపంచం ఓ నవ్య ప్రపంచం
సాధించగల ధీరులకిది దివ్య ప్రపంచం

విశ్వం గుట్టు ఒక్క క్షణములొ రట్టు
ఉపయోగించుకుంటె ఫైబరు నెట్టు

మెదడు పదును పెట్టు ఫేస్ బుక్ లొ నెట్టు
ప్రపంచమంత చూపించును సైబరునెట్టు!

ఆఫీసు హాజరు కెగనామం పెట్టు
ఇంటి నుండి పనిచేస్తూ జీతం పట్టు

అంతులేని సమాచారం సిడిలో బంధించి
విశ్వంలో ఎక్కడైన విరివిగా వాడవచ్చు
Read More

Tuesday, December 19, 2017

మనకవితలు టీమ్

భాషను ప్రేమించరా ! ( BHASANU PREMINCHARAA TELUGU KAVITHALU IN TELUGU )
          భాషను ప్రేమించరా!

భాషను ప్రేమించరా బతుకును పండించరా
బాష నేర్చుకుంటే నీ బతుకే బంగారురా!

భాషే మన మెతుకురా భాషే మన బతుకురా
భాష రాకపోతే మన బతుకే ఆగమ్మురా

మాతృభాష మాధుర్యం మదినిండా నింపరా
హృదిలోని భావాలను అలవోకగ తెలుపరా
Read More

Sunday, December 17, 2017

మనకవితలు టీమ్

అమ్మ అందమైన కల! ( AMMA KOSAM TELUGU KAVITHALU )అమ్మ అందమైన కల!


అమ్మ ఎపుడు కంటుంది అందమైన కలలు
ముచ్చటైన తన బిడ్డ గొప్పగ ఎదగాలని

స్త్రీ గర్భధారణతో ప్రారంభమైన కలలు
ప్రసవించిన పాపతో సాకారమగును ఇలలో

దినదినము బిడ్డ పెరిగి పెద్దదైన విధము
తల్లి మనసు తపియించును పాప పెరుగుదలను
Read More