వినీల ఆకాశం లో జాబిల్లి వెన్నలను వర్షిస్తున్న వేళ
మల్లె జాజులు విరబూసి పరిమళాలను వెదజల్లుతున్న వేళ ...
హృదయ వీణ మృదు మధుర ప్రేమ సంగీతాన్ని ఆలపిస్తువుంటే
చెలి చెంతకు చేరి ప్రేమ సరాగాలకు శృతి కలుపుతువుంటే .....
నీ జ్ఞాపకాల వర్షం లో నే తడుస్తూ వున్నా
నీ ఊహల వుప్పెనలో నే మునుగుతూ వున్నా
నీ అనురాగ సరాగాలనే నే వింటూ వున్నా
నీ తలపుల తలబ్రాలనే నా తల పై మోస్తూ వున్నా
ప్రియతమా చిరు నవ్వులే చిందించి
చిరు కోపాన్నే దూరం చేసావు .. .!
చిరు దివ్వేనే వెలిగించి
జీవితం లో చీకటినే ప్రాలద్రోలావు...!!
చిరు జల్లులా వచ్చి
మనసులో ప్రేమ వర్షాన్నే కురిపించావు ..!!