దుర్ముఖికి వేడు(కోలు) (DURMUKHI NAMA SAMVASTARA UGUDI SUBHAKANKSHALU)
క్రొంజిగురాకు చాయ సరిక్రొత్త నిగారపు చీరగట్టి,
అభ్యంజన కేశబంధమున బంధుర గంధ మనోజ్ఞ మల్లికా
మంజరులన్ ధరించి, వనమాల గళమ్మున దాల్చి, శ్రీలతో
రంజిలజేయవచ్చె జవరాలు యుగాది మనోహరాకృతిన్.