నిన్ను తలవకుండా ఒక క్షణం అయినా ఉండాలనుకుంటే . . ,
మనసున ముద్ర పడిన నీ రూపం పదే పదే గుర్తు వస్తుంది...
నీ రూపాన్ని చూడకూడదని కళ్ళు మూసుకుంటే . . ,
కలత నిద్రలో కమ్మని కలగా వచ్చి కలవర పెడ్తున్నావు...
నీ పేరు పలక కుండా మౌనంతో పెదవిని కట్టేస్తే . . ,
నీ పేరే గుండె చప్పుడుగా ప్రతిధ్వనిస్తూ అంతరంగంలో మారు మ్రోగుతుంది...