స్తంబించిన సృష్టి మాఘమాసపు మూడవ
ఝాము సన్నాయి నాదాలకు కళ్ళు నులిమిన వేళ . . . ,
నిదురించిన ప్రకృతి తొలి ఉషస్సు చుంబనంతో
మత్తుగా వొళ్ళు విరుచుకుంటున్న వేళ . . ,
అప్పుడె ఊపిరి పోసుకొని అలవోకగా చిగురించే
లేలేత మావి చిగురు కోకిలమ్మ పాటలకు
మైమరచి పచ్చని ఊసులాడే వేళ . . ,