శుభోదయం కవితలు తెలుగు | Inspirational good morning quotes in telugu

Inspirational good morning quotes in telugu, Inspirational good morning quotes in telugu images, Inspirational good morning quotes telugu in English

inspirational good morning quotes in telugu


సంకల్పాన్ని బలంగా నమ్మండి
సంశయాలను తొలిచి వేయండి
సందర్భాలను ఆహ్వానించండి
సంతోషాలను ఆశ్వాదించండి

స్నేహాలను  పలకరించండి......
ఈ చిరుజీవితాన్ని ఆనందంగా గడపండి...




Inspirational good morning quotes in telugu

inspirational good morning quotes telugu in English



Sankalpaanni balangaa nammandi
Samshayaalanu tolachi veyandi
Sandarbhaalanu aavhaaninchandi
Santoshaalanu aashwaadinchandi
Snehaalanu palakaarinchandi
Ee chirujeevitaanni aanandangaa gadapandi ...
.
.
.
.
Thulasi Uppara (Anantapur),,,

COMMENTS

BLOGGER: 6
  1. 🌺🌺🌺🌺 శుభోదయం 🌺🌺🌺🌺

    ************* (విరించి) *************


    నీలిగగనం కెంజాయి వర్ణమములుకుంది
    ఉదయించే రేకంటికి నీరాజనాలిస్తుందేమో
    .....................

    అందుకే ప్రాతరుథ్థానులై
    భువిపైనుండి
    ఖగరాసి హారతి గీతాల నాలాపిస్తున్నాయి
    ..................

    శతకోటి మయూఖాల ధరించి
    తిమిరారాతి ధ్వాంతాన్ని
    ధ్వంసమొనరింప వేంచేస్తున్నాడు
    మిత్రమా....

    విరహంతో వేగిపోతున్న కమలాల
    ఆర్తిదీర్చ చీకటిలో జఢత్వంలో
    కూరుకుపోయిన జగత్తుకు నవ
    చేతనాన్నందించ తూరుపున
    గగనంలో సిందూరంలా తళుకులీనే
    త్రయీతనువు గాంచ మేలుకోనేస్తమా

    నీకిదే సుప్రభాతం

    ReplyDelete
  2. పక్షిజాతుల కువకువ
    రాగాలతో స్వాగతం పలికే
    వేళ
    చల్లని మలయమారుతం
    స్వేచ్ఛావిహంగమై వీచెడు
    వేళ
    నభాంతరమ్మేతన మేనుకు
    పసుపు రాసుకున్న వేళ
    కలువలు అలకలుపోయి ముడుచుకుంటుంటే చూసి
    కమలాలు ఫక్కున నవ్వుతూ
    ఆనందంతో వికసింపబూను
    వేళ
    ఆ కమల దళాలలా నీ కనురెప్పలని విప్పి నిద్రమేల్కొ నుమో నేస్తమా
    గడిచిన కాలమెలావున్నా
    రాబోయే కాలాలన్ని మంచిరోజులంటూ భావించమొయి
    నీకు శుభోదయం

    ReplyDelete
  3. 😀😀😀 శుభోదయం నేస్తమా! 😀😀😀

    దొంబులగొట్టు ధ్వాంతమది
    యండజాల అరుపులకే భీతిలి
    పశ్చిమ దిశకేసి పరుగెత్తి పారుట
    గాంచి కాసారాలలో విరహంలో
    మునిగిన కమలాలు తన ఆప్తుని
    మౌనగీతాన్నాలాపిస్తూ పిలిచాయట.....

    నిన్న సాయంత్రమస్తమించిన
    నిదాఘకరుడు కలువల ప్రార్థన నాలకించి తూరుపు కొండలను దాటి
    వచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి....

    రాత్రి సూర్యునితో లేచిపోయిన వెలుగు
    తిరిగి భూతలాన్ని చేరుకోడానికి
    క్రమక్రమంగా ప్రయత్నిస్తున్న వేళ యిది

    ఉదయించే భాస్వంతునకు
    పక్షిజాలము ప్రభాత వీణియపై
    మయూఖతంత్రుల మీటుచూ
    సుప్రభాత భూపాల గీతిల నాలపిస్తూంటే

    ఆ గాన మాధుర్యానికి పరవశించి పిల్లతెమ్మరలు పులకించి నర్తనమాడుతుంటే తరువులు ఆనందంతో ఊగిపోతున్నవేళ
    పూర్వాద్రులలో ప్రభవించు ఉదయభాస్కరుని గాంచ మేలుకో మిత్రమా!!

    ReplyDelete
    Replies
    1. విరించి గారు,

      మీ కవితలు బాగున్నాయి..
      మీ కవితలు మాతో పంచుకోవడానికి ఈ లింక్ పై నొక్కండి
      https://www.manakavitalu.com/p/blog-page_27.html ..
      మరింత సులభంగా మాకు కవితల్ని పంపించడానికి మా ManakavitaluApp నీ ఈ లింక్ ద్వారా మీ ఫోన్ లో Install చేసుకో గలరు https://play.google.com/store/apps/details?id=com.manakavitalu.ManakavitaluApp

      Delete
  4. చాలా బాగున్నాయి🙏

    ReplyDelete

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content