Thursday, February 14, 2019

మనకవితలు టీమ్

ప్రేమలేఖ ( Prema lekha valentines day love letter )

Prema lekha valentines day love letter images download


.....ప్రేమలేఖ....

ప్రియమైన "నీకు"
నీపై నాకున్న ప్రేమని నీకు తెలియజేయాలని, ఈ లేఖ ద్వారా నా చిన్ని ప్రయత్నం. కానీ....
నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానా.. అని అనుమానం కలుగుతోంది. అంటే 'నిన్ను ప్రేమిస్తున్నా' అని అనడం కన్నా, నిన్ను ప్రేమిస్తున్నానన్న భావాన్ని ప్రేమిస్తున్నానేమోనని అనిపిస్తుంది.


ఈ భావం ఎంత మధురంగా ఉంది అంటే
"నా నుండి నేను వేరయి నీలో కలసిపోతున్న భావన"
అలా జరుగుతున్న పక్షంలో "నేను" అన్న పదానికి అర్థమే లేదు. అంటే..
నువ్వు అంటేనే నేను...
నేను అంటేనే నువ్వు...

నువ్వూ నేనూ ఒకటే అయినపుడు మనం కలిసిలేమనే భావనే లేదు..
నువ్వూ నేనూ... మనముగా మారే సమయం కోసం ఎదురు చూస్తూ...

నీ
అనుకునే
"నేను"
.
.
.
.
.
.
.
.
Neelima anil

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...