Wednesday, August 1, 2018

Manakavitalu Team

మనమంతా ఒకే కులం ( TELUGU INSPIRATIONAL QUOTES IN TELUGU )



telugu inspirational kavithalu images download

కులం కులం అని అరిచేవు
కాము మనం కాకులం
ఏల నీకీ మనోవ్యాకులం
విశ్వంబుధినీదే నావికులం

మనముండునది గోకులం
మంచి అనే రాజ్యనికి పాలకులం
మంచి పనికి మనమే నాయకులం
చెడుని మట్టు పెట్టే సైనికులం


స్వతంత్ర్య సమరయోధులది యే కులం?
వారే లేకున్న మనమనామకులం
యేకులైవచ్చి మేకులైన తెల్లవారి గుండెల్లొ
అయినాము మనం చాకులం, బాకులం, తుపాకులం

నవభారత నిర్మాణానికి పాటుపడే శ్రామికులం
భావి భారతావనికి వన్నె తెచ్చే యువతీయువకులం
మనమంతా ఒకే కులం
భరతమాత ప్రేమికులం
.
.
.
.
లక్ష్మీరాజ్యం జొన్నలగడ్డ

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...