నీ కళ్ళలోని కాంతి నా కళ్ళని తాకి
నా పెదవులపై చిరునవ్వుగా పూసి
నా మనసుని చేరి
నీ మనసు లోతుల్లోని ప్రేమను
నా మనసు మీద ముద్రలు వేస్తే…
ఆ ముద్రలను అక్షరాలుగా మార్చి
నేను కాగితంపై పెడితే…
అది కవిత గా మారి నిన్ను చేరి
నీ పెదవుల వెంట పాటగా వస్తుంటే…
ఆ పాట నా మనసుని చేరి,
నన్ను నేనే మరచి
నిన్ను కోరి, నీలో చేరి,
నీ మనసులో బందీ అయి…
నీలో సగమై.. ఉండిపోనా…….
.
.
.
.
.
నీలిమా అనిల్