లేలేత ప్రాయం నుండి
కలసి పెరుగుతూ ………
సున్నితమైన మనసుతో
భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ ………
నా సంతోషాన్ని
నీ ఆనందముగా ……..
నా బాధను
నీ సమస్యగా ………..
స్వీకరిస్తూ , పరిస్కరిస్తూ …..
మలచిన నీ జీవన శైలి నాకు ఎంతగానో ఆదర్శనీయం !
అమ్మ అన్న పదంలోని మొదటి అక్షరాన్ని ,
నాన్న అన్న పదంలోని చివరి అక్షరంతో
కలిపి “అన్నవి” అయినావు ……..
మాటల్లో గడసరి ….
ఆటల్లో నేర్పరి ….
చేతల్లో తుంటరి …..
విధానాలలో చమత్కారి ……..
ప్రతి నిమిషం , ప్రతి చోట ,
నీ కర్తవ్యాని నిర్వర్తిస్తూ …..
నేను నీకు అండగా ఉన్నానని
భరోసాఇస్తూ……
నీవు తీర్చి దిద్దిన విధానం అభినందనీయం!
నువ్వు చేసే ప్రతి పనిలో వైవిద్యం చూపిస్తూ ……….
మృదు స్వభావంతో …..
సమదమములైన వైఖరితో …
అందర్నీ కలుపుకుంటూ
నీ బాటను పూలబాటగా మార్చుకున్న
విధేయత ఆదర్శనీయం !
క్లిష్ట సమయా ల్లో
చేదోడువాడుగా వుంటూ …….
సంక్లిష్ట సమయాల్లో
నేనున్నా అని ఉనికిని చాటుకుంటూ …
నీ బాధ్యతాయుత జీవితాన్ని
సరళ మార్గంలో ప్రయాణింపజేస్తున్న
పరిణితి అద్వితీయం !
మొహమాటాలకు తావివ్వకుండా ,
దృఢ సంకల్పంతో ,
ఆత్మవిశ్వాసముతో ,
నీ జీవితంలో మంచి స్థాయీని అధిరోహించాలని ఆశిస్తూ………………….
నీ
చిన్నారి చెల్లెలు (DEEPTI)