Two Wheeler vs Life Quotes in Telugu.
భార్య భర్తలులా రెండు చక్రాలతో కదిలే వాహనం,
ఇద్దరూ కలిసి ఉంటేనే జీవితం సాఫీగా సాగును అని అందులో మర్మం !
ఎప్పుడూ ముందుకు మాత్రమే పరుగులెత్తే వాహనం,
పని మొదలెట్టిన తరువాత వెనుకకు చూడకు అని పరమార్థం !
దారి ఎలా ఉన్నా ఆగదు తన పయణం,
కష్టాలు వచ్చినా గమ్యం చేరే వరకు విశ్రమించకు అని అందులో అర్థం !
చుట్టూ ఉన్న వాహనాలను చూసి జాగ్రత్తగా వెళ్ళమని చెప్పే అద్దాలు,
మన చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ మోసపోకుండా ఉండు అని తెలిపే నీతులు !
దారిని బట్టి మారే బండి గేరులు,
కాలాన్ని బట్టి మారవలసిన బతుకు పరుగులు !
దారికి అడ్డు వచ్చినప్పుడు ఆగమని చెప్పే బ్రేకులు,
ఓటమి వచ్చినప్పుడు స్థిమితంగా ఉండమని చెప్పే సూక్తులు !
పెట్రోల్ అను ఇంధనం ఉంటే ముందుకు సాగిపోవును వాహనం,
శ్రమ అనే ఇంధనం ఉంటే గెలుపు బాట లో సాగిపోవును జీవితం !
Two Wheeler vs Life Quotes in English.
Bharya barthalu la rendu chakralatho kadhile vahanam,
Iddaru kalisi vuntene Jeevitham safiga saagunu ani andhulo marmam !
Eppudu mundhuku matrame parugulette vahanam,
Pani modalettina taruvatha venukaku chudaku ani parmartham !
Dhari ela vunna aagadhu thana payanam,
Kastalu vacchina gamyam chere varaku visraminchaku ani andhulo artham !
Chuttu vunna vahanalanu chusi jagratthaga vellamani cheppe addhalu,
Mana Chuttu vunde manushulanu gamanisthu mosapokunda vundu ani thelipe neethulu !
Dharini batti maare Bandi gerulu,
Kalanni batti maaravalasina bathuku parugulu !
Dhaariki addu vacchinappudu aagamani cheppe brakulu,
Otami vacchinappudu sthimitham ga vundamani cheppe sukthulu !
Petrol ane indhanam vunte mundhuku saagipovunu vahanam,
Srama ane indhanam vunte gelupu batalo saagipovunu Jeevitham !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)...
COMMENTS