రైతు కోసం తెలుగు కవితలు | Farmer Quotes Telugu

0
993

Farmer Quotes Telugu in Telugu Text.

 Farmer Quotes Telugu

నువ్వు మట్టిలో బతుకుతావు

మా కోసం బతుకుతావు !
మట్టిని దైవంగా కొలుస్తావు
పైరును ప్రాణంగా భావిస్తావు !
నీ స్వేదంతో నేలను తడుపుతున్నావు
నేల నుంచి సిరులు పండిస్తున్నావు !
వాన చుక్క కోసం పడిగాపులు కాస్తున్నావు
కరువు రక్కసితో నిరంతరం యుద్ధం చేస్తున్నావు !
కష్టపడి పంట సాగు చేస్తున్నావు
గిట్టుబాటు ధర లేక రోదిస్తున్నావు !
అందరికి అన్నం పెడుతున్నావు
నువ్వు మాత్రం పురుగుల మందు సేవిస్తున్నావు !
నీ నవ్వు మాకు సుభిక్షం రైతన్నా
నీ కన్నీరు మాకు దుర్బీక్షం రైతన్నా !
రైతు బతుకులు మారాల్సింది చిత్రాల్లో కాదు
రైతు బతుకులు మారాల్సింది వ్యవసాయ క్షేత్రంలో !!

 Farmer Quotes Telugu in English

Nuvvu mattilo bathukuthavu
Maa kosam bathukuthavu !
Martini daivam ga kolusthavu
Pairunu pranam ga bhavisthavu !
Nee swedham tho nela nu thaduputhunnavu
Nela nunchi sirulu pandisthunnavu !
Vaana chukka kosam padi gaapulu kaasthunnavu
Karuvu rakkasi tho nirantharam yuddam chesthunnavu !
Kastapadi panta saagu chesthunnavu
Gittubaatu dhara raaka rodhisthunnavu !
Andhariki Annam peduthunnavu
Nuvvu matram purugula mandhu sevisthunnavu !
Nee navvu maaku subiksham raithanna
Nee kanneru maaku durbiksham raithanna !
Raithu bathuku maaralasindhi chitralalo kaadhu
Raithu bathuku maaralasindhi vyavasaya kshethram lo !
.
.
.
.
Dr. Purushotham (Chittoor)…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here