Gnapakam Telugu Kavithalu About Life.
“జ్ఞాపకం
కలల కడలిలో
జ్ఞాపకాల అలలతో నిండిన ఈ జీవన ప్రయాణం ఎంతవరకు….?
నీ జీవిత గమ్యం మధుర జ్ఞాపకాలతో నిండినంతవరకు….!
నిన్ను నువ్వు ప్రపంచానికి పరిచయం చేసుకొన్న రోజు
నీ తల్లి నిన్ను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన రోజు ఓ మధుర జ్ఞాపకం..
కమ్మనైన అమ్మ అనే పిలుపు ఓ జ్ఞాపకం..
నాన్న వేలు పట్టి నేర్చిన నడక ఓ జ్ఞాపకం..
అన్నయ్యతో ఆడిన చిలిపి తగాదాలు ఓ జ్ఞాపకం..
స్నేహితులతో చేసే అల్లరి ఓ జ్ఞాపకం..
నచ్చిన పుస్తకం చదవడం ఓ జ్ఞాపకం..
మనసుకు నచ్చిన అమ్మాయిని చూసి ముసి ముసి నవ్వులు నవ్వటం ఓ జ్ఞాపకం..
ఆ అమ్మాయి చూసే కొంటె చూపు ఓ చిలిపి జ్ఞాపకం..
నేను అనే జ్ఞాపకం నుండి మనం అనే జ్ఞాపకంలోకి తీసుకొచ్చే పెళ్ళి ఓ మధుర జ్ఞాపకం..
ప్రేమతో శ్రీమతి నుదుట మీద పెట్టే ముద్దు ఓ జ్ఞాపకం..
శ్రీవారి రాక కోసం గుమ్మం దగ్గర ఎదురుచూపు ఓ జ్ఞాపకం..
తొమ్మిది నెలలు ప్రాణాన్ని కాపాడి తన బిడ్డకు ఒక ప్రపంచాన్ని ఇచ్చే క్షణం ఆ తల్లికి ఓ తీపి/మరువలేని జ్ఞాపకం..
ఆ బిడ్డను తన చేతులోకి తీసుకుంటూ తనే ఇక నా ప్రపంచం అని మురిసిపోయే క్షణం ఆ తండ్రికి ఓ మధుర జ్ఞాపకం..
కనులముందే పిల్లల ఎదుగుదల చూడటం తల్లిదండ్రులకు ఓ జ్ఞాపకం..
పిల్లలకు పెళ్ళి అనే బంధం ద్వారా ఒక సంబంధాన్ని ఇవ్వడం ఓ జ్ఞాపకం..
మనవళ్లతో చెప్పే పిట్ట కథలు ఓ జ్ఞాపకం..
పక్క వాళ్ళ ఆనందంలో మన ఆనందం వెతుక్కుని ఆ సంతోషాల సంపదతో గడిపే చివరి క్షణాలు ఓ తీపి జ్ఞాపకం..
కానీ ఈ జ్ఞాపకాలన్నీ మళ్ళీ తిరిగి రావనే జ్ఞాపకం ఓ చేదు జ్ఞాపకం..
ఆ జ్ఞాపకాల ఒడిలో నిదురపోయే చావు కూడా ఓ జ్ఞాపకమే..
అందుకే ఓ మహా కవి ఇలా అన్నాడు….
“చేదు జ్ఞాపకాల చేతులు విడనాడి
తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ
మధుర జ్ఞాపకాలను మదిలో తలచుకొంటూ
ముందుకు సాగడమే ఈ జీవితం….అని”
-మీ రామ్(నాని)
గమనిక: ఆ మహా కవి ఎవరో నన్ను మాత్రం అడగొద్దు…..😉”
.
.
.
.
Nani (Visakhapatnam)…
Thank u brother…
Mee lines use chesukovacha…
Jagan garu,
Thank you for your interest in manakavitalu.com .
All the quotes published here are free for personal use only.
Please contact us for any other use.