స్వీయోద్ధరణ తెలుగు కవితలు | Telugu Poem about Safety Precautions

Telugu Poem about Safety Precautions Telugu Poem about Safety Precautions images, Telugu Poem about Safety Precautions in Telugu

Telugu Poem about Safety Precautions  in Telugu


అహా! ఏమి ఈ వైపరీత్యము
పరితాపముగల్గుచున్నదే నేడు ఈ మానవుని దుస్థితిన్ గని
తారాలోక చకితా బిరుదాంకితులైన నరులకు ఇట్టి పరాభవమా
సనతుడినే త్యజించి స్వయంభవు రూపు గావించిన దేహవంతునకిట్టి సంబాధమా
భారతేతిహాసములయందు సహితము ఇట్టి విచిత్రము విచితము గాలేదే
వైద్యకంబులావేదించిన విషయవిషదంబులయందిట్టి యాగంతుకము గానలేదే


Telugu Poem about Safety Precautions

విత్రాసితకము కాదు కాకూడదని తలంచి గావించిన అనుధావనంబులేల నిష్ఫలితములు గావలె
రుజాకరకారకంబుల నిరోధనా కార్యంబులవంబనంబుల యందేల దుష్ఫలితములు రావలె
అయ్యోరే! ఉపశమన బోధనలయందు లక్ష్యముంచని దుష్ట మానవులకేరీతి బోధించవలె
నిమీలనా సమ్మేళనములొనరించు జాడ్యోపకరణంబుల తీరు నిర్లక్ష్య నరుల కేమేర అగపరచవలె
నక్తందినముల్ సువిద్రితముల్మరచిఉత్థానదిత్యోద్ధరణే హార్ధమనెడి వెజ్జులన్ గనియైన
మతిన్ జలించరే ఉపద్రవములెరిగియు పెడతిరుగుదారులన్ జక్కంజేయగ హాతువునకెదురేగు రక్షకభటులన్ గనియైన మదిన్ జలించరే
శుద్ధీకరణంబే రోగ నివారణంబని యెరిగి తెగువజూపి పురవీధులన్ శుద్ధి చేయు పారిశుద్ధ్య కార్మికులన్ గనియైన పాఠముల్ నేర్చరే
ఇప్పుడైనను మేల్కొనవలె పాతక రోగంబారిన బడిసోలి వశమవుచున్నట్టి దేశముల పాటు గని
ఇప్పుడైనను పాఠము నేర్వవలె శిరములొంచడమెరగని దేశములందు శవములెంచి
అయినను మన విధియేమి?గృహ కవచములు ధరించుటయే గదా?
ధరించుదము, పరివార సహిత శ్రేయస్కరము నినదించుదము
మరొక విధియేమి?కారణరహిత విహరణా నిరోధమే గదా?
నిరోధించుదము, మృత్యు వాహకములుగా మారుటయేల?
చుబ్రమోత్తరీయముల్ ధరించి, జన సమ్మేళనములయందెడంబు బాటించి
కరాదుల శుభ్రతనలవరించి, స్వీయోద్ధరణ గావింతము
నిన్ను నన్ను గన్న జన్మ భూమి ఋణము దీర్చుటకన్న మిన్న యేమున్నదిరా యన్నా!
సర్వే జనా సుఖినో భవంతు!
.
.
.
.
Manohar (కొడమల మనోహర్)...

COMMENTS

Loaded All Posts Not found any posts VIEW ALL Readmore Reply Cancel reply Delete By Home PAGES POSTS View All RECOMMENDED FOR YOU LABEL ARCHIVE SEARCH ALL POSTS Not found any post match with your request Back Home Sunday Monday Tuesday Wednesday Thursday Friday Saturday Sun Mon Tue Wed Thu Fri Sat January February March April May June July August September October November December Jan Feb Mar Apr May Jun Jul Aug Sep Oct Nov Dec just now 1 minute ago $$1$$ minutes ago 1 hour ago $$1$$ hours ago Yesterday $$1$$ days ago $$1$$ weeks ago more than 5 weeks ago Followers Follow THIS PREMIUM CONTENT IS LOCKED STEP 1: Share to a social network STEP 2: Click the link on your social network Copy All Code Select All Code All codes were copied to your clipboard Can not copy the codes / texts, please press [CTRL]+[C] (or CMD+C with Mac) to copy Table of Content