కావాలి కొంత సమయం
కాస్త ఆగేందుకు
కాళ్లు చాచేందుకు
కనులు వాల్చేందుకు
కలను తరచేందుకు
తగ్గాలి ఇంత వేగం
దమ్ము తీసేందుకు
దుమ్ము దులిపేందుకు
దిశను వెతికేందుకు
దశను మార్చేందుకు
పొందాలి కొత్త గమనం
పదును పెరిగేందుకు
పరిధి పెంచేందుకు
పరుగు నెగ్గేందుకు
పరువు దక్కేందుకు
విరామమే కోరేది విరమణ కాదు
వికాసమును మది విడువగ లేదు
ఆగేది ఇంకెంతో సాగేందుకే
అసలైన అర్థాన్ని తెలిసేందుకే
—–నళిని కిషన్——-
నైస్