Monday, October 27, 2014

మనకవితలు టీమ్

అందానికే అందం . . . ! ! !

andanike andam telugu kavitalu on images

ఓ జవరాల.....నా ప్రియురాలా.....
అందం...అందానికే అందం నీ అందం
నెలవంకలాంటి నీ నుదుటకు కుంకమ అందం
నీ సోగ కన్నులకు కాటుక అందం
నీ సొట్ట బుగ్గలకు సిగ్గులు అందం
నీ అధరాలకు చిరునవ్వు అందం
నీ ఓంపు సొంపులకు చీర కట్టు అందం
నీ అందం నాదే అయితే నాకెంతో ఆనందం


ఇంటికి రంగల్లులు అందం
ఇంటి గడపకు పసుపు కుంకుమలు అందం
ఇంటికి ఇల్లాలు అందం
ఇల్లాలికి ఓరిమి అందం
ఆ ఓరిమి నీలో ఉంటే నాకెంతో ఆనందం

నీలాల నింగిలోన తళుకులీను తారల అందం
తారలకు జాబిలి అందం
జాబిలికి వెన్నల అందం
వెన్నలలో తడిసే పుడమి తల్లికి ఆమని అందం
ఆ వెన్నల నీవే అయితే నాకెంతో ఆనందం . . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
ఆకెళ్ళ రామలక్ష్మి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
October 31, 2015 at 4:51 PM delete

Disclaimer: My critique to this poem is intended to improve your skills

Good points:
3rd part of the poem feels good.

improvements:
- choose best lines (need not include all the thoughts/lines that you have come up)
1st part of the poem contains more than the others.
- I think the adjectives to eyes, forehead doesn't require.
soga kannulaki, nelavankalanti nuditiki


Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...