Telugu Quotes about Bribe in Telugu.
చాయ్ పానీలతో పనులయిన రోజులొకప్పుడు
అదే రాచపుండులా వికృతరూపం దాల్చి
వ్యవస్థలన్నిటినీ కబళించి నాశనమైన దేశమిప్పుడు!
పుడితే లంచం, చస్తే లంచం,
రేషన్ లంచం, ఆదాయానికి లంచం,
కులానికి లంచం, మతానికి లంచం,
ఆస్థి అమ్మితే లంచం, ఆస్థి కొంటే లంచం,
ఇళ్ళుకడితే లంచం, ఇంటి పన్నుకు లంచం,
కరెంటుకు లంచం, నీటి కుళాయికి లంచం,
ఉపాధికి లంచం, ప్రభుత్వ పధకాలకు లంచం,
ప్రమోషన్ కి లంచం, పింఛనుకు లంచం,
రైతన్న అడంగలుకు, పాసుపుస్తకానికి లంచం,
చివరికి కళాశాల, విశ్వవిద్యాలయాల డిగ్రీ,
డాక్టరేటులకు లంచం,
ఆఖరికి దేవుడికీ లంచం!
మానవరక్తం మరిగిన పులులవోలె,
పీల్చి పిప్పిచేసే లంచావతారులు,
బహుమానంగా అందంగా,
పిలుచుకొనే లంచం!
.
.
.
.
నీలకంఠ