16 COMMENTS

  1. గణేశుడు అనబడే దేవుడు కాస్తా అధునికభారతీయం దెబ్బతగిలి గణేషుడు ఐపోయి విలవిలలాడుతున్నాడు.
    ఈ దిక్కుమాలిన తెలుగుచూసి తెలుగుతల్లి దిగులుపడి కూర్చుంది.
    కాలో దురతిక్రమణీయః, గణేశుడి కైనా సరేను!

    • మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి తప్పును తెలియజేసినందుకు ధన్యవాదములు ..
      మీ వంటి పెద్దలు, పెద్ద మనసుతో మా తప్పులను మరియు మా తెలుగును కూడా సరిచేయగలరు …
      మీ సలహాలు, సూచనలు మాకు ఎప్పుడు అందించ గలరు. . .

      • మనకవితలు టీమ్ వారికి నా సూచనలు సహృదయంతో స్వీకరించినందుకు ధన్యవాదాలు. మున్ముందుకూడా ఎప్పుడైనా సూచనలు చేయవలసి వస్తే సంకోచించవలసి వచ్చేలా ఇక్కడ అకొందరు అజ్ఞాతమిత్రులు అభ్యంతరపూర్వకంగా మాట్లాడారు. దయచేసి గమనించండి. అట్టి అనవసరవ్యాఖ్యలనూ (వాటికి నా సమాధానాలతో సహా) తొలగించటం మంచిదని నా సూచన. ఎవరైనా ఏదైనా ముసుగుమనుష్యులుగా ఇష్టారాజ్యంగా మాట్లాడే చోటకు వెళ్ళటమూ తద్వారా ఇబ్బందిపడటమూ అవసరం కాదని నా అభిప్రాయం. మీరు నా సూచనను సహృదయంతో స్వీకరిస్తూనే ఆ సూచనలపై వెక్కిరింపులను కూడా ప్రచురించటం వలన ఏమి చెప్పదలచుకున్నారో బోధపడటం లేదు.

    • ఒకరి తప్పులు వేలెత్తి చూపడానికి ముందు మన తప్పులు సరి చేసుకోవాలి

      ఐనా తెలుగు తల్లి దిగులు పడేది తెలియక జరిగిన తప్పు వల్ల కాదు ,
      తెలుగు తెలుసని 'ఆధునికాన్ని' ' అధునికం ' చేసిన మీలాంటి వాళ్ల వల్ల.

        • తప్పుపట్టటం అనే సరదా యేమీ లేదండీ. తప్పులు కనిపిస్తే చూపటం సరిజేసుకుంటారనే ఆశతోనే. కాని మీలాంటివారి ఎత్తిపొడుపులకి జడిసో విసిగో ఆపని చేయట మానటమే మంచిదైన పక్షంలో తప్పులు తెలిసేదెలాగు? సరిజేసుకొనే దెప్పుడు? దయచేసి ఆలోచించండి. ఐనా నాకు ఈబ్లాగు యజమానులతో తప్ప మిముబోటి వారితో పని లేదనుకుంటాను.

        • ఎనానిమస్సుగారూ! మనలో తప్పు పట్టేవాడు ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మన జ్ఞానం మన అదుపులో ఉంటుంది.

          నువ్వు ఇంద్రుడూ, చంద్రుడూఅంటూ కొంతమంది నెటిజన్లు పొగుడుతూ ఉన్నందుకే, కొందరు బ్లాగర్లు గర్వం పెంచుకోని జ్ఞానశూన్యులు అవుతునారు.

      • పెద్దలు నా తప్పులు ఎత్తిచూపిన సందర్భాలూ – ఆతప్పుల్ని నేను సరిజేసుకున్న సందర్భాలూ ఉన్నాయండి. నాతప్పుల్ని నేను ఎవరు ఎత్తి చూపినా, 'ముందు మీ తప్పులు తెలుసుకోండి' వంటి అవినయపూర్వకమైన మాటలు మాట్లాడలే దెప్పుడూ. బోధయంత పరస్పరం అన్నట్లు అందరమూ మనమన తప్పుల్ని సరిజేసుకొంటూనే సాగుతూ ఉండాలి కదా.

        • తప్పులు తెలియజేసే / సరిదిద్దే పద్ధతి ఇది కాదేమో అని నా అభిప్రాయం.

          'ఈ దిక్కుమాలిన తెలుగు చూసి తెలుగుతల్లి దిగులుపడి కూర్చుంది ' అని వ్రాశారు.

          ఇది ఏ ఉద్దశ్యంతో వ్రాశారో మికే తెలియాలి.

          • I agree with you అనానిమస్ గారు. అతను అలా వ్రాసుండాల్సింది కాదు, నాకూ నచ్చలేదు. కొంతమంది స్వభావమే అంత. తెలుగుతల్లి దిగులుపడడం, పొర్లగొంతలు పెట్టడం, పగలబడి నవ్వడం ఇలాంటివన్నీ సినేమాల్లో బాగుంటాయేమో గానీ బ్లాగుల్లో కాదు. ఈ రోజుల్లో స్కూల్లో టిచర్లు తిడితే, కొడితే ఒకప్పటిలా పడే రోజులు కావు అలాంటిది ఎవరో రాసిన బ్లాగుల్లో తప్పులు చెప్పేటప్పుడు కొంత సంయమనం అవసరమేమో అతను ఆలోచించుకోవాలి. కానీ కందకులేని దురద కత్తిపీటకెందుకు సార్. ఈ బ్లాగు ఓనర్ కి నెప్పనిపిస్తే అతనే/ఆమే సొంత ఐ.డి. తోనే ఆ ముక్క చెప్పగలరు కదా. బ్లాగు ఓనర్ తను కరెక్ట్ చేసుకున్నారు, ఆయన/ఆమె అంత ఫీలయితే వాళ్ళే ఆ ముక్క చెబితే బాగుంటుంది.

      • ఈ బ్లాగు ఓనర్ రాసింది భాషా దోషం దానిని వాళ్ళు ధైర్యంగా ఒప్పుకుని సరిదిద్దుకున్నారు, దానిని సరిచేయమని చెప్పినవాడి దాంట్లో ఉన్నది కేవలం టైపింగ్ దోషం. టైపింగ్ మిస్టెక్ కి అంత సాగదీస్తున్నారంటే బహుశా పాతపగలేమైనా ఉన్నాయా మీకు!

        • మీ వాడుక భాష ఒకసారి తిరిగి చూసుకోండి. ముసుగు వీరులు అంటూ గేలి చెయ్యడం మీరు నేర్చుకున్న భాష సభ్యత. మిమ్మల్ని ఎవరూ తిరిగి అనకూడదు, అంటే మాత్రం పాత పగలున్నట్లే మరి

          • నా భాష?? ఇదేందబ్బా, నేను కామెంటెట్టిందే ఇప్పుడు గదా!! అయినా 'ముసుగు వీరుడు' లో తప్పేముంది. నేనూ మీలా ముసుగువీరుణ్ణే….

    • పురుషోత్తం గారూ, తప్పులు వెదకటం అని అంటున్నారే, ఇంక ఎవ్వరూ పొరపాట్లను సూచించవద్దని చెప్పటం మీ ఉద్దేశమా. ఈ బ్లాగువారు అలా అనుకోవటం లేదనుకుంటున్నాను. ఇలా విరుచుకుపడటం వలన మేలా కీడా అన్నది మీరూ ఆలోచించండి. మీరైతే కనీసం ఒక పేరుతో కనిపించారు, కొందరైతే ముసుగువీరులుగా ఉండి అక్షతలు వేస్తున్నారు!

      • పేరు చెబితే తప్ప మీకు ఆనదా? మీ అంత తెలివిలేక బ్లాగ్ డెవలపర్స్ ఈ అనామక ఆప్షన్ పెట్టారనుకుంటున్నారా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here