Saturday, February 3, 2018

Manakavitalu Team

ఓ మనిషి పారిపో! ( O MANISHI PARIPO TELUGU INSPIRATIONAL QUOTES )


ఓ మనిషి పారిపో! ( O MANISHI PARIPO TELUGU INSPIRATIONAL QUOTES IMAGES DOWNLOAD )

ఓ మనిషి పారిపో!
ఇక్కడ నవసమాజ నిర్మాణానికి
పునాదులు వేస్తున్నారు.

మానవత్వం లేని ఓ మనిషి పారిపో!
ఇక్కడ మనుషులంతా ఒక్కటేనని
మనిషిని మనిషే దేవునిగా పూజిస్తారు.


పగ ప్రతీకారాలు ఉన్న ఓ మనిషి పారిపో !
ఇక్కడ శాంతియుత సహజీవన శంఖారావం
పూరించబడుతున్నది.

కుల, మత నిర్మిత ఓ మనిషి పారిపో!
ఇక్కడ మానవ కులము,
మానవత్వమను మతం మాత్రమే ప్రజ్వరిల్ల బడుతుంది.

ఈర్షా, ద్వేషాలు ఉన్న ఓ మనిషి పారిపో!
ఇక్కడ ఒకమనిషి మరో మనిషికి సహాయపడతాడు.
ఒక మనిషి ఇంకో మనిషిచే
ఉన్నత శిఖరాలకు చేర్చ బడతాడు.

అందుకే
మనిషిని మనిషిగా గుర్తించని ఓ మనిషి
మానవత్వాన్ని కూకటి వేళ్ళతో పెకిలించిన  ఓ మనిషి
కుల మత రహిత  ఓ మనిషి పారిపో!
నవ సమాజ నిర్మిత మవుతుంది పారిపో!
.
.
.
.
.
G Sivannarayana.......

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...