Wednesday, February 28, 2018

మనకవితలు టీమ్

నా ప్రయాణం ( NAA PRAYANAM TELUGU ONTARITANAM KAVITHALU ) . . .


 NAA PRAYANAM TELUGU ONTARITANAM KAVITHALU IMAGES DOWNLOAD

మనిషిని మనిషిగా గుర్తించే మంచి మనిషి కోసం నా ఈ ప్రయాణం  . . .

డబ్బు అనే మత్తులో మునిగి స్వార్థపరులుగా ఎదిగిన ఈ నీఛపు సమాజంలో  . . ,
ఒక మనిషికి, తన భావాలకి విలువనిచ్చే నిజమైన మనుషులకోసం నా ఈ ప్రయాణం  . . .

బంధాలని విడిచి, అనుబంధాలని మరిచి ఒంటరి బ్రతుకును కోరే ఈ అరణ్యం లో . . ,
ప్రేమామృతాన్ని పంచి, ప్రేమగా జీవించే మనుషుల కోసం నా ఈ ప్రయాణం  . . .


మానవత్వాన్ని మరిచి రాక్షసులుగా బ్రతికే ఈ లోకంలో . . ,
ధర్మాన్ని నిలిపి శాంతిని పంచే మనసున్న మనుషుల కోసం నా ఈ అలుపెరగని ప్రయాణం  . . .

వ్యసనాలకి లోనై బానిసలగా మారి జీవితాలని అంధకారం చేసే ఈ చీకటి రాజ్యంలో  . . ,
జ్ఞాన జ్యోతులని వెలిగించే మనుషుల కోసం నా ఈ జీవన గమనం  . . . .
.
.
.
.
.
.
Gowthami...


మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...