Thursday, December 21, 2017

Manakavitalu Team

దివ్య ప్రపంచం ! ( TELUGU POEM ABOUT TODAY'S GENERATION, TECHNOLOGY AND SOCIAL MEDIA )



దివ్య ప్రపంచం !

నేటి ప్రపంచం ఓ నవ్య ప్రపంచం
సాధించగల ధీరులకిది దివ్య ప్రపంచం

విశ్వం గుట్టు ఒక్క క్షణములొ రట్టు
ఉపయోగించుకుంటె ఫైబరు నెట్టు

మెదడు పదును పెట్టు ఫేస్ బుక్ లొ నెట్టు
ప్రపంచమంత చూపించును సైబరునెట్టు!

ఆఫీసు హాజరు కెగనామం పెట్టు
ఇంటి నుండి పనిచేస్తూ జీతం పట్టు

అంతులేని సమాచారం సిడిలో బంధించి
విశ్వంలో ఎక్కడైన విరివిగా వాడవచ్చు
కాలు బయట పెట్టకుండ ఇంటర్నెట్ సాయంతో
ప్రపంచాన్ని చూడవచ్చు పనులు చక్కబెట్టవచ్చు

అందమైన చిత్రాన్ని అరసెకనులో చిత్రించి
పైస ఖర్చులేకుండ ప్రపంచమంత పంపవచ్చు

ఎవరి సాయం లేకుండా ఎంచక్కా జిపిఎస్ తో
అనుకున్న గమ్యానికి అవలీలగ చేరవచ్చు

స్కైపులోన కనబడుతూ కబురులెన్నొ చెప్పుకుంటు
దూరమన్న భావనను మదిని తొలగించవచ్చు

వ్యాట్సాప్ సందేశాలతొ ప్రేరణను పొందవచ్చు
జీవితం విలువలను విశ్వానికి పంచవచ్చు

సందేహం కలిగినంత గూగుల్ పై ఒక నొక్కుతొ
మదిలోని ప్రశ్నలకు జవాబులెన్నొ పొందవచ్చు


సరదాలకు వాడుకుంటె సంకనాకమంటుంది
మంచి పనులు చేస్తనంటె మనకు సహకరిస్తుంది

సాంకేతిక పరిజ్ఞానం సవ్యమైన మార్గంలో
అవసరమున్నంతవరకు వాడుకుంటె అది వరం

అధిక తెలివి ప్రదర్శించి పరిధులను దాటివేస్తె
బంగారం లాంటి బతుకు బండలగును ఇది నిజం

వీడరోయి నేటి యువత పట్టిన పట్టు
విజయాలనెన్నొ సాధింతురు నీమీదొట్టు

కలిసి మెలిసి చదువుకుంటు కబుర్లెన్నొ చెప్పుకుంటు
భవిష్యత్తుకు పునాదులను బహుచక్కగ వేసుకుంటు

చిలిపి చేష్టలే కాదు అమోఘమైన మేథస్సుతొ
అంతరిక్ష రహస్యాలు అతి సులువుగ ఛేదింతురు

లవ్ అఫైరు నడుపుతూనె లైఫ్ పైన స్కెచ్ వేసి
అందమైన కలలన్ని నిజం చేసి చూపింతురు

ప్రయోజకుల ప్రేమిస్తే తప్పేముంది
ఈ ప్రపంచానికిపుడొచ్చిన ముప్పేముంది?

అంత పిచ్చివాళ్ళు కాదోయి నేటి మన యువతరం
అన్నింటిని చక్కబెట్టి పయనింతురు విజయ పథం

ఇంకేమి కావాలోయి నేటి మన యువతకు
ఇంతకన్న ఏమున్నది సాధించ ఈ జగతిలొ

నిత్యం నిందిస్తుంటె నీరుగారు యువతరం
భుజం తట్టి బుజ్జగిస్తె మారుతుంది నవతరం

వివేకానంద కలలుగన్న నేటి మన యువతరం
సాధింతురు విజయాలెన్నొ ముమ్మాటికి ఇది నిజం!
***






రచన: నాగులవంచ వసంత రావు

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...