నేనూ............ ఓ చిట్టి గులాబీని
నేను ఓ చిట్టి గులాబీని
సువాసనల సుతారపు రెమ్మలతో
ఓ అందమైన కుసుమాన్ని !
నేను పుష్పించిన రోజు అంతా కన్నుల పండగ
కొత్త విశాలమైన రంగుల లోకం
నా చుట్టూ భ్రమరములు , సీతాకోకచిలుకలు , తేనెటీగలు
నన్ను ప్రేమతో ముద్దాడిన వారెల్లరు నాలోని
సువాసన గాంచి మైమరచెదరు
చరిత్ర తిరగేస్తే ఇంటింటికి గులాబీ మొక్కలుండేవి
ఇప్పుడు మాకూ కుటుంబ నియంత్రణ చేయించి కుండి మొక్కను చేసారు
అలనాడు మొక్క నిండా మేము
ఇంటికి ఇంతికి అందాలము మేము
పూజారి మడితో మమ్మల్ని దేవుడి కి భక్తితో సమర్పించేవాడు
నెరజాణ సిగలో మమ్మల్ని ఇముడ్చుకొని
తెగ మురిసిపోయేది
ప్రేమికుల ప్రేమ వారధులము
కీర్తిశేషులా మెడలో హారాలము
గతం కల చెదిరింది ..........
ఇళ్లల్లో మచ్చుకు కుడా లేము
కొమ్మలు నాటే సంస్కృతి నుండి నర్సరీలలో పెరుగుతున్నాము
ప్రేమ ఆప్యాయతలతో కాదు డబ్బులకు అమ్ముడవుతున్నాము
మొగ్గలోనే త్రుంచి వేయబడుతున్నాము
వందల మైళ్ళు ప్రయాణిస్తున్నాము
రసాయనాలతో పుష్పిస్తున్నాము
శీతలగదిలో బంధీలవుతున్నాము
నేటిలోకాన్ని తేరిపారా చూడకనే చెత్తలో మురిగిపోతున్నాము
పూజారులు , అతివలు , ప్రేమికులు ఒకరేమిటి అందరు బేరసారాలే మాదగ్గర
గుడి , తోట , శుభకార్యాలు, స్మశానాలకే పరిమితమయ్యాము
పువ్వులుగా కాకుండా వస్తువులుగా మీకు ఎక్కువగా చేరువవుతున్నాము
మూడు రోజుల మా బంగారు బ్రతుకులను ఇంత వ్యాపారంగా మార్చారే
వంద సంవత్సరాల మీ జీవితాలు ఇంకెంత వాణిజ్యమయ్యాయో గమనిస్తున్నారా
మీ యాంత్రికతను చూసి ముచ్చట పడాలో
మీ ఇరుకు మనసులను చూసి గర్హపడాలో పాలుపోకున్నాము
చిట్టి గులాబీని .........ప్రేమతో మన్నిస్తారు కదూ .
.
.
.
.
Shekar Babu Penuganti ......
Please add your valuable comments.
But don't misuse it ...