Thursday, April 13, 2017

Manakavitalu Team

ఎలా మరువను ( ELA MARUVANU TELUGU PREMA KAVITHALU )

ఎలా మరువను ప్రియ నేస్తమా...
ఎలా మరువను సుమ కుసుమమా...
పాట పడుకోగా పల్లవి నీవేగా, కవిత రాసుకోగా తలపులు నీవేగా . . ,
వెన్నెలలో ఆరుబయట చందమామ నీ మోమై చల్లగ నవ్వేగా. . .

కోకిలమ్మ రాగాలలో... చిలకమ్మ అందలలో...
జింక పిల్ల గెంతులో... విరిసే పూ బంతిలో...
నువ్వూ కనిపించి కవ్విస్తే, జ్ఞాపకాలు కదలి వస్తే
నీ జ్ఞాపకాలు కదలి వస్తే.       ||ఎలా||


విరహం అనే జ్వాలలో ఆణువణువూ దహిస్తుంటే...
చెలి కౌగిలి కొరకు తనువు అనుక్షణం తపిస్తుంటే...       ||ఎలా||

ఓటమిలో ఓదార్పుని పొందిన నీ వడిలోనే,
ప్రేమలోన ఓడి పొతే... ఓదార్పే కరువయ్యేనే
నిన్ను తలవకుండా నీ తలపులు లేకుండా
ఒక్క క్షణం బ్రతకలేను... ప్రేమని నే చంపలేను.         ||ఎలా||
.
.
.
.
.
T Udayakumar Yadav

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...