Sunday, March 5, 2017

Manakavitalu Team

అమ్మాయినిరా ( A girl letting the boy know that she is the girl for him )

నీ నవ్వు నా వయసు మంచును తాకి, నా కను రెప్పలును కదలించావురా,

నీ చూపు నా మనసును చేరి, నా తొలి గుండె చప్పుడు నువ్వే పొందావురా,

నా పెదవి ఏంచెప్పాలో , నిన్నెఅడిగిందిరా,

నా ఈడు ఏం కోరింతో నీకె తెలియాలి రా,

ఈ అల్లరి పిలుపే నా పేరురా ...


చలి గాలి తాకి నన్ను పిలుస్తు వుంటే, నీ వెచ్చని కౌగిలితో నన్నుఆపేవురా,

నా నోట పలికే ప్రతి అక్షరం నీ ముద్దుతో పూర్తయిందిరా,

నీతో ఉండాలని నే ఎవ్వరికీ చెప్పను, నీకె నీకె అని నీ మనసు చెప్పిందిరా,

ఈ అల్లరి పిలుపే నా పేరురా ...

తరలించే నీరు నా సఖి నువ్వే అని నీతో అల్లుకు పొమ్మంది,

నా అర్థం కానీ ప్రశ్నలకు సమాధానం నువ్వే అని నాకు మాటే ఇస్తోంది,

ఇంకా నేనే నేనే నీ అమ్మాయిని , నీ అమ్మాయిని,

డార్లింగ్నీ నీ సమాధానం ఏంటి–మమ (Darling’s response),

ఇది చాలురా ...

నీ నవ్వు నా వయసు మంచును తాకి, నా కను రెప్పలును కదలించావురా,

నీ చూపు నా మనసును చేరి, నా తొలి గుండె చప్పుడు నువ్వే పొందావురా,

ఈ అల్లరి పిలుపే నా పేరురా… అదే నీ అమ్మాయినిరా …
.
.
.
.
.

Nandigana Vishal

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...