Tuesday, February 14, 2017

Manakavitalu Team

ప్రేమికుల రోజు ( HAPPY VALENTINES DAY 2017 )

ప్రేమికుల రోజు



శీతాకాలం వేకువజాము పొగ మంచు  అడుగుతోంది

ఎక్కడ నీ ప్రియుడు అని??


పొగ మంచు కి ఎలా చెప్పగలను

నా హృదయం లో నే కొలువై వున్న సంగతి!!





పెరట్లో విరబూసిన మందారం నవ్వుతూ అంటోంది

నాలా అయినా పలకరించాడా నీ చెలికాడు అని??


మందారానికి ఎలా తెలుపగలను

నా పెదవుల పై ఉన్న నవ్వు తనదే అని!!




సముద్రపు అలలు నా పాదాలను చేరి ఆడుకుంటూ పరిహసిస్తున్నాయ్

కలలో అయినా కనిపించాడా నీ కలల రాకుమారుడు అని??


అలల కు ఎలా చూపగలను

అతని ఊహలు  వరదలా నన్ను ముంచెత్తు తున్నాయని!!




అమావాస్య రాత్రి మినుకుమంటున్న తార అడుగుతోంది

నీ ప్రియుడి జాడ ఎటు వైపు అని??


తార కి ఎలా చూపగలను

అతని తలపులు వెన్నెలలా నన్ను ఎలా తడుపుతున్నాయో!!



నేనే తను, తనే నేను అయినపుడు


ఎక్కడ ఉంటేనేం

నాతో వున్నట్టు కాదా??


ఏ రోజాయితేనేం

రోజూ ప్రేమికుల రోజు కాదా???



నీలిమ అనిల్.........

Manakavitalu Team

About Manakavitalu Team -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...