Tuesday, August 2, 2016

మనకవితలు టీమ్

ఎలా పెంచుకోను ఈ ద్వేశాన్ని . . . .?

మించే ప్రేమను ముంచేస్తే . .,
పంచే ఆశను తెంపేస్తే . . ,
మనసుని మళ్ళీ చంపేస్తే  . . ,
ఎలా చెప్పుకోను ఈ అలజడి . . ?

దించే బరువుని పెంచేస్తే . . ,
గుండెల చప్పుడు ఆపేస్తే . . ,
మంచిని చెడుగా మార్చేస్తే . . ,
ఎలా ఒప్పుకోను హే హతవిధి  . . . !

రెండు మనసులు ఒకటెతే . . ,
రగిలే గుండెలు వేరైతే . . ,
మండే హృదయం శాశిస్తే . . ,
ఎలా తప్పించను ఈ రాతని . . ?

కదిలే కాలం తిరిగొస్తే . . ,
చితిలో ప్రాణం లేచొస్తే . . ,
వెలుగున్నా చీకటి కనిపిస్తే . .,
ఎలా మలుసుకోను ఈ జీవితాన్ని . . !

కంచే చేనుని మేసేస్తే . . ,
నచ్చేవన్నీ దొచేస్తె. . ,
మెచ్చే మనిషిని శాపిస్తే . . ,
ఎలా పంచుకోను ఈ బాధని . . ,?
ఎలా పెంచుకోను ఈ ద్వేశాన్ని . . . .?

.
.
.
.
MALLAPRAGADA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...