నిన్నే చూసిన నిమిషం మొదలు . ,
నీతో కలిసిన తరుణం మొదలు . . ,
నీదరహాసపు తాకిడితో నాలో తెలియని అలజడి మొదలు ....
నీతో కలిసిన తరుణం మొదలు . . ,
నీదరహాసపు తాకిడితో నాలో తెలియని అలజడి మొదలు ....
చూపులు విసిరిన చిరుబాణాలు . ,
నీ నవ్వులు చేసిన మృదు గాయాలు . ,
ఒంటరిగున్నా , ఎందరు ఉన్నా నను వీడవులే నీ గుసగుసలు ...
వింతలు చూపిన ఈ ఉదయాలు . ,
నను ఒంటరి చేసిన సాయంత్రాలు . . ,
నిను చూడాలని తొందర నాలో పెంచెను ఎన్నో కోరికలు ....
నా తోడై నువ్వుంటే చాలు . ,
నీ ప్రేమను పంచిస్తే చాలు . . ,
నిండుగ మనను దీవించేందుకు నేలకి దిగరా ఆ దేవతలు ...
.
.
.
.
రామ్ ...
2 comments
Write commentsSuper
ReplyChala bagundi
ReplyPlease add your valuable comments.
But don't misuse it ...