కొండపల్లి ఛలాకి బులాకీలు కొన్ని . . .
కనక మాలచ్చిమి కల్యాణమప్పటివి కొన్ని . . .
రామ తీర్థములో పిన్నిగారిచ్చినవి కొన్ని . . .
ఉప్మాక తీర్థమప్పుడు తుని అమ్మమ్మ గారిచ్చినవి కొన్ని . . . !
కోటప్ప కొండ తిరణాలవి కొన్ని . . . ,
లక్కపిడతలు రాతి బొమ్మలు . . . ,
చిలిపి క్రిష్నుడు,చిన్న రైలు . . . ,
టమటమాల బండి,తరతరాల చెక్క సిపాయి . . . , !
పాల పిట్ట,పూసల పేరులు,కాసుల రాణీ .. . ,
ఇంటి పిల్లి,బొమ్మ కుక్క,వంట పాత్రలు . . . ,
నెల్లూరి నెరజాణ,బతకమ్మ బుట్ట . . . ,
కొల్లేటి కొంగ,నవ్వేటి బుద్ధుడు . . . , !
రాళ్ళ బొమ్మలు,రతనాల బొమ్మలు ,
పూలు,పళ్ళు,బళ్ళు వోడలు,ఎన్నెన్నో . . .,
కదిరి తేరు,కర్నూలు చరఖా . . . ,
నంద్యాల నంది, లేపాక్షి బసవన్న . . . ,
తాటాకు టపాకాయి అమ్మాయికి . . . ,
సిసింద్రీ అబ్బాయికిచ్చి మాఇంట పెళ్ళి . . . !
పిల్లపాపలతో రారండి . . ,
మా ఇంట వాయనము . . ,
మీ కొంగు బంగారమండి . . .,
రారండి రారండి . . . ! !
కొలువైన కనక డుర్గమ్మ పేరంటమండి . . . !!!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
సత్యనారాయణాచార్యులు*
Please add your valuable comments.
But don't misuse it ...