. . . . . ? ? ? ( పేరు పెట్టండి )

3
193

¤ ప్రశాంతమైన నా జీవితంలోకి చిరునవ్వులా తొంగి చూశావు . . ,

స్నేహం తెలిసిన నా మనసుకి ప్రేమని పరిచయం చేశావు . . . !

ప్రేమంటే తెలియని నాకు ప్రేమామృతం రుచి చూపించావు . . ,

నావాళ్ళందరికీ నన్ను దూరం చేశావు . . . !

బాధే తెలియని నా కళ్ళకి కన్నీటిని పరిచయం చేశావు . . ,

నీకు దూరమైన నా మనసులో చిరునవ్వే లేకుండా చేశావు . . . !

నా ప్రపంచం నువ్వే అనుకునేలా చేశావు . . ,

నీ ప్రేమలో లోకాన్ని మరిపించావు . . . !

గడిచిపోయిన నాకిష్టమైన రోజులు తిరిగిరావు . . ,

నాది కాని ఈ వర్తమానం నాకవసరం లేదు . . . ,

నేనూహించిన భవిష్యత్ నాకందివ్వగలవా ప్రియతమా . . . . !

.

.

.

.

.

.

పండు ¤

www.manakavitalu.blogspot.com

&

www.ram4u.heck.in

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here