¤ మండుతున్న నా గుండెల సాక్షి . . ,
జారుతున్న నా కన్నీటి సాక్షి . . . !
దూరమైన చిరునవ్వు సాక్షి . . ,
దరికిరాని ఓదార్పు సాక్షి . . . !
చేరువైన ఈ బాధల సాక్షి . . ,
ఒంటరైన నా వలపు సాక్షి . . . !
పెంచుకున్న నా ఆశల సాక్షి . . ,
పంచుకున్న ఆ ఊసులు సాక్షి . . . !
నా గుండెలోని ఈ ప్రేమ సత్యం . . ,
ఎదురు చూపులే నీకై నిత్యం . . . !
వీడి నన్ను పోవద్దు నేస్తం . . ,
తిరిగి రాని ఏ దూర తీరం . . . !
.
.
.
.
.
ప్రేమతో నీ రామ్ ¤
www.manakavitalu.blogspot.com