Thursday, November 29, 2018

మనకవితలు టీమ్

ఏమి పట్నం ( Quotes About life in Cities Rather than Villages in Telugu )



ఏమి పట్నం ఏమి పట్నం,
ఏమి బ్రతుకు విచిత్రం,
వేల వేటల వెర్రి పరుగులో,
విశ్రాంతికై విఫల యత్నం.

మనసు కోరగా అన్ని రుచులు,
ఇంటి ముందు ప్రత్యక్షం,
కాని,,,కడుపు నిండగ మూడు పూటల
తిననివ్వదు కొవ్వు భయం....
||ఏమి పట్నం||


అన్ని భాషల వెలుగు జిలుగులు,
అద్దుకుంది అక్షరం,
కాని,, ప్రక్కవారిని పలుకరించగ,
వృధాలే అంది సమయం.....
||ఏమి పట్నం ||


బండి అన్న బైకు కాదు,
కారు తోనే గౌరవం,
కాని,,టైరు టైరుకు తోడు చేరెగా,
గాలి లోన వింత కాలుష్యం....
||ఏమి పట్నం ||


అడగకుండా అందుబాటే,
అడుగడుగున సౌకర్యం,
కాని,,అడిగినా మరి అరుదు కాదా,
అవసరానికి ఒక్క సాయం....
||ఏమి పట్నం||


విత్తమున్నది చిత్తమున్నది,
ఆహా! లేనిదేమిక ఉన్నది,
కాని,, తరచి,మనసుకిది తెలిసే లోగా,
మిగులకున్నది జీవితం....
మిగులకున్నది జీవితం....
||ఏమి పట్నం|| 
-------నళిని కిషన్----------

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...