Saturday, November 10, 2018

మనకవితలు టీమ్

ఏమని చెప్పను ( quotes about breakups and moving on )



quotes about breakups and moving on images download



తొలకరి జల్లు అడిగింది, ఎక్కడ నీ ప్రియుడు అని . ,
కన్నీళ్లని కానుకగా ఇచ్చి శోక సముద్రంలో నన్ను వదిలి పోయావని చెప్పనా....?

పిల్లతెమ్మర అడిగింది , ఎక్కడ నీ చెలికాడు అని . ,
బాధలనే బహుమతిగా ఇచ్చి నిరాశల లోకంలో వదిలేసి వెళ్లావని చెప్పనా....?


పున్నమి నాటి చందమామ అడిగింది , ఎక్కడ నీ కలల రాకుమారుడు అని . ,
అమావాస్య రోజు వెన్నెలనే తోడుగా ఇచ్చి చీకటి ప్రపంచములో వదిలి వెళ్లావని చెప్పనా....?

సంధ్యవేళ విచ్చుకున్న మల్లెపూవు అడిగింది , ఎక్కడ నీ మనోహరుడు అని . ,

మౌనమే నా మాటగా మనసులో యుద్ధం చేసుకోమని నీ హృదయం నుండి నన్ను  బహిష్కరించావని చెప్పనా....?

ఏమని చెప్పను...
ఎంతని చెప్పను...


Tolakari jhallu adigindi  , ekkada nee priyudu ani  . ,
Kanneellani kanukagaa ichi sokha samudramlo nannu vadili poyavani cheppanaa . . . ?

Pillatemmera adigindi , ekkada nee chelikadu ani . ,
Badhalane bahumatigaa ichi nirashala lokamlo vadilesi vellavani cheppanaa . . . ?

Punnami nati chandama adigindi ,  ekkada nee kalala rakumarudu ani . ,
Amavasya roju vennelane todugaa ichi cheekati prapanchamlo vadili vellavani cheppanaa . . ?

Sandhyavela vichukunna mallepuvu adigindi , ekkada nee manoharudu ani . ,
Mouname naa maatagaa manasulo yuddham chesukomani nee hruduyam nundi nannu bahiskarinchaavani chappanaa . . . ?

Emani cheppanu . . ?
Entani Cheppanu . . . . . . ?
.
.
.
.
.
.

నీలిమా అనిల్......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...