Friday, January 26, 2018

మనకవితలు టీమ్

ఊహా సుందరి! ( UHAA SUNDARI DREAM GIRL TELUGU KAVITHALU )



సృష్టికర్త ప్రతిభకు ప్రత్యక్ష రూపానివో . . ,
అమర శిల్పి జక్కన చెక్కిన శిల్పానివో . . .

అవనిలోని అందమంత అమరిన జవరాలివో . . ,
రసికుల హృదయాల దోయు కొంటె నెరజాణవో . . .

ఉషోదయపు మంచు తెరలు కడిగిన ముత్యానివో . . ,
శ్రీగంధపు పరిమళాల మన్మధ బాణానివో . . .


ఒంపు సొంపు లొలకబోయు బాపు గీసిన బొమ్మవో . . ,
చూపరు నలరింపజేయు అచ్చ తెలుగు రెమ్మవో . . .

ప్రేమ మధువు జాలువారు అమృత భాండానివో . . ,
ప్రేమాభిషేక చిరుజల్లుల అమర పాలవెల్లివో . . .

రసికత రగిలింపజేయు రాకాసి పిల్లవో . . ,
కామిక హృదయాల గీయు చిలిపి అగ్గి పుల్లవో . . .

ఓర చూపు వలవేసి నిండు మనసు దోచేసి . . ,
కంటి చూపుతోనే నను కర కర నమిలేస్తవో . . .

సుతిమెత్తని నీ స్పర్శకు ఒళ్ళు పులకరిస్తుంది . . ,
వింత వింత లోకాలకు మనసు పరుగు తీస్తుంది . . ,

నడుమెంతో బంగారం నడకెంతో వయ్యారం . . ,
అలరించిన సింగారం అందానికే మణిహారం . . .

చిరునవ్వుల దరహాసం మన్మధునికి పరిహాసం . . ,
ఆనందపు తీరాలకు ఆహ్వానపు సందేశం  . . . !
***
.
.
.
.
.
నాగులవంచ వసంత రావు ...

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...