నిన్ను తలవకుండా ఒక క్షణం అయినా ఉండాలనుకుంటే . . ,
మనసున ముద్ర పడిన నీ రూపం పదే పదే గుర్తు వస్తుంది…
నీ రూపాన్ని చూడకూడదని కళ్ళు మూసుకుంటే . . ,
కలత నిద్రలో కమ్మని కలగా వచ్చి కలవర పెడ్తున్నావు…
నీ పేరు పలక కుండా మౌనంతో పెదవిని కట్టేస్తే . . ,
నీ పేరే గుండె చప్పుడుగా ప్రతిధ్వనిస్తూ అంతరంగంలో మారు మ్రోగుతుంది…
నీ స్పర్శని సైతం మరచిపోదామంటే . . ,
నువ్వు తాకిన నా తనువు ఆ పులకరింత నుండి బయట పడను అంటుంది…
నీ జ్ఞాపకాలనైనా బందిద్దాం అని కన్నీటిని ఒడిసిపడితే . . ,
హృదయం ద్రవించి నదిలా ప్రవహిస్తుంది…
నిన్ను మరచిపోవాలని ఎంత ప్రయత్నించినా . . ,
గుండెల్లో కొలువై ఉన్న నీ ప్రతి రూపం మరలి పోనంటుంది…
ఒక నిమిషమైనా నిన్ను మరువలేనని తెలిసీ నన్ను వీడిన నీ కోసం,
ఆరాట పడుతున్న మనసు . . ,
రావని తెలిసినా వస్తావని మభ్యపడుతున్న మనసుని జోల పుచ్చుతూ ఆశల లోకంలో బ్రతికేస్తున్నా …….
.
.
.
.
.
నీలిమా అనిల్……
Gud one…