Friday, September 8, 2017

మనకవితలు టీమ్

నా దేశం ( NAA DESHAM TELUGU QUOTES ABOUT INDIA )


నా దేశం ( NAA DESHAM TELUGU QUOTES ABOUT INDIA IMAGES DOWNLOAD)

అమరమైనది నా దేశ రాజసం ..
వ్యాపించింది నా దేశ కీర్తి నలు వైపులా ...
పులకించింది నా దేశం గంగా యమునల ప్రవాహం తో ...
నిలయమైంది నా దేశం విశిష్ట సంపదలకు ...
వివిధ కళలకు నిలువెత్తు రూపం నా దేశం ..

స్వేచ్ఛకు మారుపేరు నా దేశం ...
ఆధిపత్య పోరుకు ఆరాటపడని దేశం నా దేశం ...
తెల్లజాతి శత్రువులుకు సింహస్వప్నం నా దేశం ...
అనేక మేధావులను ప్రపంచానికి అందించిన దేశం నా దేశం ...


ఏముంది ఇక్కడ అని నిన్ను నిండుస్తుంటే పొరుగు దేశం ...
దేశమంటే ఒక జాతి, ఒక కులం కాదని ..,
దేశమంటే విభిన్న జాతులు, కులలకి నిదర్శనం ...
అని నూవ్విచ్చిన సమాధానమే నా దేశం ....

అమ్మా నీ సహనం హిమాలయ శిఖరం ...,
నువ్వు ఇచ్చిన సంపద విలువ కట్టలేనిది ...,
నువ్వు నేర్పిన సంస్కృతి మరువలేనిది ...,
మా పూర్వీకుల గొప్పతనం చాటలేనిది ...,
నువ్వు ఇచ్చిన శాంతి అమరమైనిది ....

దేశమంటే మట్టికాదోయ్ అంటూ నీ బిడ్డలని కలిపావు . . ,
భిన్నత్వంలో ఏకత్వం అంటూ మనసుల అమరికలు చెరిపావు ..,
స్వచ్ఛ భారత్ అంటూ నీ దేశాన్ని స్వచ్ఛం చేశావు . .
నిర్భయ అంటూ అబలకి అండగా నిలిచావు ...,

అటువంటి నా దేశాన్ని ఏమని వర్ణించను, ఎంతని వర్ణించను ....
జన్మ జన్మకి నీకే అంకితం నా ప్రాణం ....






Amaraminadi na desa rajasam..
Vyapinchinadi na desa keerthi nalu vipula..
Pulakinchinadi na desam ganga yamunala pravaham tho..
Nilayaminadi na desam visishta sampadulaku..
Vividha kalalaku niluvethu rupam na desam

Svecha Ku Maru Peru na desam..
Adipatya poruki aratapadani desam naa desam..
Tella jathi satruvulaki simhaswapnam na desam..
Aneka medavulani prapanchaniki andinchina desam na desam..

Yemunadi ichata ani ninu nidustunte porugu desam
Desamante oka jathi,oka kulam kadani
Desamante vibina jathulu, kulalaki nidrasanam
Ani nuvichina smadaname naa desam...

Amma ni sahanam himalayasikaram..
Nuvvu ichina sampada viluva kattalenidi..
Nuvvu nerpina samskruti maruva lenidi..
Maa purvikula gopathanam chatalenidi..
Nuvvu icchina shanti amaraminadi..

Desamante matti kadhoi antu ni biddalani kalipavu..
Binatvam lo ekatvam antu,manasula amarikalu cheripavu...
Swath bharath antu ne desani swatham chesavu..

Nirbhaya antu abalaki andaga nilichavu....

Atuvanti na desanni emani varninchanu yentani varninchanu.....

Jnma jnmaki Nike ankitam na pranam.....

.
.
.
.
.
.
M.NAVEENA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...