Wednesday, August 2, 2017

మనకవితలు టీమ్

ఎలా నిన్ను చేరను ప్రియతమా ( ELA NINNU CHERANU PRIYATAMA TELUGU LOVE QUOTES )

ELA NINNU CHERANU PRIYATAMA TELUGU LOVE QUOTES PREMA KAVITHALU


ఎలా నిన్ను చేరను, ఏమని నీ మది తట్టను ?

నీ మాటలనొసిగే మధువులనేరుతూ   చీమనై చేరనా !

నీ  చూపులు జల్లే  కౌముది  కాంతులకై  మిణుగురునై  చేరనా!

నీ నవ్వున పూచే మల్లెల తేనెలు తాగ  భ్రమరమై  చేరనా!!


ఎలా నిన్ను చేరను, ఏమని నీ మది  తట్టను?


నా గుండెన సవ్వడి నీ   పేరే పలుకుతుందని  చెప్పనా!

నా  నడకల వడి నీ   వైపేనని చెప్పనా!

నా ఊపిరి  నీ  తలపులేనని  నీ   మది తట్టి చెప్పనా !!


Elaa ninnu cheranu, emani nee madi tattanu ?

Nee matalanosige madhuvulanerutu chimanai cheranaa . !

Nee chupulu jalle koumudi kantulakai minugurunai cheranaa .!

Nee navvuna puche mallela tenelu taga bhramaramai cherana . !

Elaa ninnu cheranu, Emani nee madi tattanu . .?

Naa gundena savvadi nee pere palukutundani cheppanaa . !

Naa nadakala vadi nee vaipenani cheppanaa . . !

Naa upiri nee talapenani nee madi tatti cheppanaa . . !!!
.
.
.
.
.
Teja Reddy...

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...