Monday, August 7, 2017

మనకవితలు టీమ్

చెల్లి ప్రేమ ( CHELLI PREMA TELUGU RAKHI | RAKSHA BANDHAN SUBHAKANKSHALU KAVITHA QUOTE )

చెల్లి ప్రేమ ( CHELLI PREMA TELUGU RAKHI | RAKSHA BANDHAN SUBHAKANKSHALU KAVITHA QUOTE )


లేలేత ప్రాయం నుండి
         కలసి  పెరుగుతూ .........
సున్నితమైన  మనసుతో
         భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ .........
నా సంతోషాన్ని
         నీ ఆనందముగా ........
నా బాధను
        నీ సమస్యగా ...........
స్వీకరిస్తూ , పరిస్కరిస్తూ .....
మలచిన నీ జీవన శైలి నాకు ఎంతగానో ఆదర్శనీయం !


అమ్మ అన్న పదంలోని మొదటి అక్షరాన్ని ,
నాన్న అన్న పదంలోని చివరి అక్షరంతో
                 కలిపి  "అన్నవి" అయినావు ........
మాటల్లో  గడసరి ....
ఆటల్లో    నేర్పరి ....
చేతల్లో    తుంటరి .....
విధానాలలో  చమత్కారి ........
ప్రతి నిమిషం , ప్రతి చోట ,
నీ కర్తవ్యాని నిర్వర్తిస్తూ .....
నేను నీకు అండగా  ఉన్నానని
                                భరోసాఇస్తూ......
నీవు తీర్చి దిద్దిన  విధానం అభినందనీయం!

నువ్వు చేసే ప్రతి పనిలో వైవిద్యం చూపిస్తూ ..........
మృదు స్వభావంతో .....
సమదమములైన వైఖరితో ...
అందర్నీ కలుపుకుంటూ
నీ బాటను పూలబాటగా మార్చుకున్న
                     విధేయత ఆదర్శనీయం !

క్లిష్ట సమయా ల్లో
        చేదోడువాడుగా  వుంటూ .......
సంక్లిష్ట సమయాల్లో
       నేనున్నా అని ఉనికిని చాటుకుంటూ ...
నీ బాధ్యతాయుత జీవితాన్ని
సరళ మార్గంలో ప్రయాణింపజేస్తున్న
          పరిణితి అద్వితీయం !

మొహమాటాలకు తావివ్వకుండా ,
దృఢ సంకల్పంతో ,
ఆత్మవిశ్వాసముతో  ,
నీ జీవితంలో  మంచి స్థాయీని అధిరోహించాలని ఆశిస్తూ......................
                                                                                              
                                                                                        నీ
                                                                          చిన్నారి చెల్లెలు (DEEPTI)

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...