Saturday, January 7, 2017

మనకవితలు టీమ్

ప్రేమించా (PREMINCHAA SAD TELUGU LOVE FAILURE KAVITHALU )



నా మనసు నిన్ను ఏం చేసింది .....?
నీ మనసులో కొంచెం చోటు ఇవ్వమని అడిగిందనా ,
మనస్ఫూర్తిగా ఇష్టపడిందనా, మరచిపోలేకపోతుందనా ........
ఆణువణువూ పూర్తిగా నిండిపోయి నిప్పు పెడుతున్నావ్ .......! .


నా కలలు నిన్ను ఏం చేసాయి .......?
నీ తోడు కోరుకున్నాయనా ,
నిన్ను నా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాయనా .......,
ఖాళీ అన్నది లేకుండా కనిపించి , కలవరపడుతున్నావ్ , కాల్చేస్తున్నావ్ ......! .

నా ఆనందం నిన్ను ఏం చేసింది .....?
నిన్ను చూసినప్పుడల్లా నన్ను కలుసుకుంటుందనా ,
నీతోనే నీలోనే ఉంది అని అర్ధం అయ్యే లోపే నువ్వు ఆధీనపరిచేసుకున్నావ్ ......!

నా నిద్ర నిన్ను ఏం చేసింది .....?
మనసు విరిగిన నిజాన్ని మరపిస్తుందనా ,
నువ్వు ఇచ్చిన బాధను దూరం చేస్తుందనా , గాయాలను చెరిపేస్తుందనా .....;
కలగా, కన్నీరుగా, కలవరింతగా, కలవరపాటుగా నువ్వే వచ్చి .... 
రాకుండా రానివ్వకుండా రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేస్తున్నావ్ .....!

నా నవ్వు నిన్ను ఏం చేసింది .....?
నువ్వే కావాలని , నీతో నవ్వాలని నడవాలని అనుకున్నాయనా ....;
నవ్వడం గతంగా మార్చేసావ్ , నాకు శాశ్వతంగా దూరం చేసేసావ్ .....! .

నా ఆలోచనలు  నిన్ను ఏం చేసాయి .....?
నిన్నే తలచుకుంటూ చూసుకుంటూ ..,
మంత్రం వేసి మాయ చేసి అబద్దంలో మనల్ని కలుపుతున్నాయన , ఒకటి చేస్తున్నాయనా......;
నీ ఆలోచనలతో అలమటించాలి , అలసిపోవాలి అని అలవాటుగా మారిపోయావు.....! .

నా ప్రేమ నిన్ను ఎం చేసింది .....?
నువ్వే నా జీవితం అని చెప్పిందనా ,
నాకు పరిచయం అయ్యి నిన్ను ప్రేమించేలా చేసిందనా.....;
 ప్రేమను తిరిగి ఇవ్వకుండా , పంచకుండా , ప్రేమించకుండా ,
 ప్రేమంటే ఇష్టం లేదంటూ , ప్రేమించాను అంటూ ఇలా ప్రాణం తీసేస్తున్నావ్ .......!  

 ఇట్లు .,
వీరేంద్ర కొప్పుల.....
(Veerendra Koppula)

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...