Friday, December 23, 2016

మనకవితలు టీమ్

గురివిందగింజ ( GURAVINDA GINJA QUOTES ON LIFE IN TELUGU )

గురివిందగింజ
నలుపు
 మదినిండా  ఆలోచనలు, ఆఅలోచనల్లో
ఆశ అక్కున చేర్చుకుంటుంది
దురాశ  దూరంచేస్తుంది
జిజ్ఞా సజీవం పోసుకుంటున్నది

జిజ్ఞాసను వీడి జ్ఞానాన్ని ఛేదించి
అజ్ఞానం ఆవరించుకుంటున్నది
మతమనే మంట కులమనే కాటిపై
నా జీవ కళేబరాన్నికాలుస్తున్నాయి
ఇవన్నీ ... నా ..జీవితంలో
నలుపైతే ...మరి...తెలుపు....




తెలుపు
ఆ ఉదయ నవ రవికాంతులు
నాలోని ఆశకు ఆజ్యం పోస్తున్నాయి
నవజీవితానికి జీవం పోస్తున్నాయి

నా ప్రశాంత నిర్మల కోమలహృదయం
ఊహాలోక ఊసలు త్రెంచుకొని
నిజజీవిత సంకేళ్ళలకు బంధీ  అయినది

నా ఆశయం అపజయాన్ని  అందించినా
ఆ అపజయం అసహనాన్ని చేకుర్చినా
ఆ అసహనం ఆవేశాన్ని పెంపొందించినా

ఆ ఆవేశం అవధులు దాటిపోయినా
ఏది ఏమైనా, ఎవరికెవరైనా
కలలు నిజమైనా , నిజాలు కల్లలైనా

చింతలను ఛేధించి, కష్టాలను కడతేర్చి
ఇష్టాలను నేరవేర్చుకోగలుగుతున్నాను..

...............మార్గం  కిరణ్  కుమార్....................

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...