Sunday, December 25, 2016

మనకవితలు టీమ్

అవకాశమాట ( AVAKASHAMATA QUOTE ABOUT UNEMPLOYED IN TELUGU )

అవకాశము + ఆ ట = అవకాశమాట
బయలుదేరింది  ఉద్యోగ వేటకు  . ,
బలయ్యింది  "నోవేకెన్సీ " తూటాకు . ,
ఆ బాధరేపింది  జీవితంపై చిరాకు  . . ,
ఇక వేగలేక మారిపోయాను 'ఎండుటాకు' . . .

ఈ ఎండుటాకులన్ని కూడి  . ,
సూర్యుడి ఎండకు మాడి . . ,
ఈ నిరుద్యోగాంధకారాన్ని వీడ . . ,
చేసాను అవకాశామువైపు "ఆఖరి - దాడి "   ...

ఆశ దారి చూపినా . ,
దురాశ దుఖః చూపక మానునా  .  ?
నిరాశ నాట్యం చేయకుండునా  . . ?

కోరిక కోపగించినా . ,
అదృష్టం అందలమెకించదా . . !
నా అభీష్టం నెరవేరదా ...!
....అన్న  ధైర్యంతో

నా అత్మస్థైర్యాన్ని " ఆనందభైరవి రాగంలో " ఆలపించి . ,
నిరాశకు నిళ్లొదిలి...,
దురాశనుదాటి . . ,
..నాకలలో  కనిపించిన  " కళలన్నీ "  నేరవేర్చుకుంటున్నాను ......


...............మార్గం కిరణ్  కుమార్....................
MARGAM KIRAN KUMAR

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...