Friday, October 7, 2016

మనకవితలు టీమ్

చెరిగిన హృదయం-3 ( PREMA VIPHALAM KAVITHA CHERIGINA HRUDAYAM-3)

వర్షించే మేఘం కోసం ఎదురుచూసే మొలకలా,
వసంతంకై వేచిన కోయిలనై,

శశి కై నిలిచిన కలువలా,
శిదిలమైన కోటలో మొండి గోడనై,
చిరు సవ్వడి అయినా నీ రాక అని,
ఉలికిపడి లేచే ఈ కలతనిదురనేంత కాలం గడపగాలేను.
పగటి కలలలో బ్రతుగాలేను, భాష మరచి ముగించలేను.

మేఘసందేసమంప కాళిదాసును గానే,
రాయబారమంప రాజసములేదే,

ముఖాముఖీ కలువగలేక,
ముఖ లేఖిని పంపుతుంటి..
చితికి నన్ను చేర్చు లోగ,
గట్టు దాటి, కట్టు మీరి రాలేవా....











Varshinche megham kosam eduruchuse molakalaa . . ,
Vasantanikai vechina koyilanai . . .

Sashikai nilichina kaluvalaa . . ,
Sidhilamaina kotalo mondi godanai . . .

Chirusavvadi ayinaa nee raaka ani . . ,
Ulikkipadileche ee kalata niduranentakalam gadupagalenu . . ,
Pagati kalalo bratukaga lenu, bhasa marichi mugincha lenu . . .

Meghasandeshamampa kaalidasunu kane . . ,
Rayabharamu pampa rajasamu lefe . . ,

Mikha-mukhi kaluvagaleka . . ,
Mukhalekhini pamputunti . . .

Chitiki nannu cherchuloga  . . ,
Gattu dati kattu miri raalevaa . . . . !

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...