Thursday, July 14, 2016

Pandu

నీడనై నడవనా నీతో . . . ! ! !

వలపన్న తీపి తొలిసారి చూపి తెల్లని నా హ్రుదయం పై
రంగుల హరివిల్లై చిగురు తొడిగింది ప్రేమ సరికొత్త ఆశలతో . . , , ,
కురిసే వెన్నెలలో పరవశాలు పంచే పాల సంద్రంపై
ఊసులెన్నో పంచుకున్నాను నా కళ్ళలో నిలిచిన నీ రూపంతో . . , , ,

ఎగిసి పడుతుంది మనసు కలల అలలపై
గిలిగింతలు పెట్టే నీ చిలిపి తలపులతో . . , , ,
ఊహలన్నీ నిజమై నువ్వే ఎదురొస్తే మబ్బుల పల్లకిపై
నింగినే పందిరి చేసి తారలనే తలంబ్రాలుగా పోసి నీడై నడవనా నీతో . . , , , !!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
పండు . . , , ,

Pandu

About Pandu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...