Friday, July 22, 2016

మనకవితలు టీమ్

చివరి కోరిక . . . ! ! !

నువ్వు నా ప్రాణమని చెప్పాలని ఉంది ,
కాని ఈ క్షణం వరకో చెప్పలేకున్నాయి నా పెదవులు....
నీతోనె నా పయనమంటున్నాయి నా అడుగులు,
కాని ఎంత వరకో తెలియదంటున్నాయి నా పాదాలు...
నీ చూపులు నా కంటిలోనె నిలపాలనుకున్నాను కలకాలమ్,
కాని ఈ క్షణం లో మూతపడతాయొ తెలియవంటున్నాయి నా కళ్ళు...

నా గుండె గుడిలో ప్రతి నిత్యమ్ చెరగని చిరునవ్వులా నిన్ను చూసుకోవాలని నా చిన్ని గుడ్దె ఆశ,
కాని ఏ క్షణంలో ఆగిపోతుందో తెలియక విలవిల లాడుతుంది...
ఇలా తీరని ఆశలతో తిరిగి రాని లోకాలకి వెల్లె ఈ సమయంలో కూడా
నా చివరి కోరిక ఒక్కటే ..
నా గుండె చప్పుడు ఆగె వరకు నీ ముఖం పై చెరగని చిరునవ్వు నై ఉండాలి . . .
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి *

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...