Tuesday, April 12, 2016

మనకవితలు టీమ్

దుర్ముఖికి వేడు(కోలు) (DURMUKHI NAMA SAMVASTARA UGUDI SUBHAKANKSHALU)

క్రొంజిగురాకు చాయ సరిక్రొత్త నిగారపు చీరగట్టి,
  అభ్యంజన కేశబంధమున బంధుర గంధ మనోజ్ఞ మల్లికా
  మంజరులన్ ధరించి, వనమాల గళమ్మున దాల్చి, శ్రీలతో
  రంజిలజేయవచ్చె జవరాలు యుగాది మనోహరాకృతిన్.

ప్రాకట వేదమంత్రములు పచ్చని రాచిలుకల్ పఠింపగా
  కోకిల పిండు పాటలును,గోరలు మంగళవాద్య నాదమీ
  లోకము నిండ నింప,నతి రుచ్య వినూత్న సుఖానుభూతులన్
  జేకొనరావె, వీక, నిజ చిత్తములొప్పుగ పల్లవింపగన్.

వేపపూవుల చేదు వెర్రి తలలు వేయు
    కామమున్ సర్వమ్ము కాల్చివైచి
  గుడమునన్ గల తీపి కుప్పించి యెగసెడు
  క్రొధమున్ సర్వమ్ము కూల్చివైచి
  చింతలో నామలమ్ము, చిత్తమ్మునున్ వ్రేచు
  లోభమున్ సర్వమ్ము లుప్తపరచి
  మావిలోని వగరు, మనసులో నెలకొన్న
  మోహమున్ సర్వమ్ము మ్రుచ్చిలించి

కారమును, లవణమ్ము వికార పరచు
మదము మాత్సర్య గుణముల మంటగలిపి
శాంతి జేకూర్చు"దుర్ముఖి"సార్ధకాఖ్య
.
.
.
.
కలువకొలను సూర్యనారాయణ

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...