Saturday, April 30, 2016

మనకవితలు టీమ్

నా కలం కదలని కవిత్వం ( A QUOTE ABOUT BHARAT THAT WE NEED TO REALIZE)

నా కలం కదలని కవిత్వం...
ఉర్రూతలూగె నా మనసుకు ఏదైనా రాయలనిపించిది – భరత మాత ను గొప్పగా వర్ణించాలని అనిపించింది
అంతే కలం చేతపట్టి .......
భరత మాత ఒడిలో ఎటు చూసినా పచ్చని పైరులే అని రాద్దామనుకున్నా...కానీ
బీడు భారిన భూములను  - కరువు ప్రాంతాలని చూసి కలం కదలలేదు

భరత మాత ఒడిలో అసలు నిరక్షరాస్యతే లేదని రాద్దామనుకున్నా... కానీ
అసలు పాఠశాలలే లేని గ్రామాలను - నిరక్ష్యరాసులను చూసి కలం కదలలేదు
భరత మాత ఒడిలో  బాల కార్మికులే లేరని రాద్దామనుకున్నా... కానీ
పుస్తకాలు పట్టుకోవలసిన చేతులను  బ్రతుకు బండి కోసం కర్మాగారాలలో వదిలి వేసిన భావి పౌరులను చూసి కలం కదలలేదు
భరత మాత ఒడిలో  పేదరికమే లేదని సమానత్వమే ఉందని రాద్దామనుకున్నా ... కానీ
ఒక పూట కూటికోసం వెట్టి చాకిరీ చేసే బీద బ్రతుకుల్ని చూసి కలం కదలలేదు
భరత మాత ఒడిలో కుల మత బేదాలకు తావు లేదని రాద్దామనుకున్నా ... కానీ
కుల వివక్షతకు గురై , మత ఘర్షణల్లో శ్వాస విడిచిన వారిని చూసి కలం కదలలేదు
భరత మాత ఒడిలో అవినీతే లేదని రాద్దామనుకున్నా... కానీ
నల్ల ధనంలో మునుగుతున్న రాజకీయవేత్తల్ని చూసి కలం కదలలేదు..
భరత మాత ఒడిలో శాంతి భద్రతలకు కొరత లేదని రాద్దామనుకున్నా ... కానీ
ఉగ్ర దాడుల్లో విగత జీవులైన జనుల్ని , జవానుల్ని చూసి కలం కదలలేదు..
హ్మ్ .. మరి ఇంకేమని రాయగలను నా యి కలం కదలని కవిత్వంలో ...అందుకే
నవ భారత నిర్మాణం జరిగినప్పుడే నా కలం కదులుతుందని ...
భరత మాత గొప్పదనం లోకమందంతట వెలుగుతుందని మాత్రమే ...
నా యి కలం కదలని కవిత్వం రాస్తున్నా....
.
.
.
.
.
.
RAVI VARMA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments
May 1, 2016 at 2:20 PM delete

బావుంది, కలలో అయినా మీ కలం కదులుతుందని ఆశిద్దాం

Reply
avatar
May 2, 2016 at 11:17 AM delete

మీ కలం కదలని కవిత్వం..కొంతమందికి అయిన కనువిప్పు కలుగుతుంది

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...