Thursday, March 3, 2016

మనకవితలు టీమ్

క్షణ క్షణం....... భయం భయం........ ( A TELUGU KAVITHA ABOUT FEAR )

 క్షణ క్షణం....... భయం భయం........

భయం భయం........అణు క్షణం......

ఎటునుంచోస్తుందో ఎలా కబలిస్తుందో తెలియదు పాపం . . ,

భయం భయం.. క్షణ క్షణం...
సాగర మదిలో సుడిగుండాలా!

భువిని చీల్చే భూప్రళయమా!

దివి నుండొచ్చే జలప్రళయమా!

 భగ భగ మండే భానుద్వేగమా!


వడి వడి గాలుల చిద్విలాశమా!

ఏ భూతము కబలిస్తుందో ఎలా మమ్ము బలిపెడుతుందో . . ,

క్షణ క్షణం....... భయం భయం........

భయం భయం........ అణు క్షణం......


ప్రతీకారంతో రగిలే పిచ్చిప్రేమనా!

కామందకారంతో మసలె ఉన్మాధంతోనా!

 అంటురోగం వెంటతెచ్చే కాలుష్యంతోనా!

ధరణినే మట్టుపెట్టే ఉగ్రవాదంతోనా!

రైతన్నలను బలిపెట్టే ఋణాలతోనా, షాకులతోనా!


ఇలా బడిలో, గుడిలో, మడిలో, ఒడిలో, నడిలో,

వడి వడిగా సాగే ప్రపంచ మార్గంలో .....

 క్షణ క్షణం....... భయం భయం........

భయం భయం........ అణు క్షణం......

.

.

.

.

.

Venkata Ramana Reddy

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
vasu
AUTHOR
April 9, 2016 at 6:57 PM delete

No words to express... Excellent is least one I can say

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...