Wednesday, November 25, 2015

మనకవితలు టీమ్

నీ కోసం నా ప్రయాణం . . . ! ! !

ఓ చెలియా !!!!!!!
నీ జాడ తెలియక నా మనసే వెతికెనులే 
నా చేత కాదంటూ వెనుదిరిగి వచ్చెనులే
నీ మోము కోసం నా కనులే చూసెనులే
కనుపడుట లేదంటూ కన్నీరే కార్చెనులే 
నీ నోటిమాటకోసం నా చెవులే రిక్కెనులే 
నీ మాట లేదంటూ బాధపడి ఏడ్చెనులే 
నీవున్న కలకోసం కనుమూసె నా నయనం 

నీ వదన కల్పన లో పులకరించే నా నేత్రం
నీ చేతి స్పర్శ కోసం ఎదురుచూసే నా హస్తం 
నీ కరమును తాకలేక వాలిపోయే అది పాపం 
నీ కరవాల కన్నులతో నా గుండె గాయం చేయకు 
నీ మల్లెల నయనాలతో నా హృదయం పావనం చేయవా? 
నువ్వు కరుణి స్తే  నీతో కాలం గడుపుతా 
నువ్వు కాదంటే కాలంలో కలిసిపోతా 
కనిపించి కరుణిస్తావో , కాదంటూ వదిలే స్తావో
నీ ఇష్టం ఓ నా ప్రియా  . . . ! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
షేక్ మహమ్మద్ గౌస్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...