Thursday, October 29, 2015

మనకవితలు టీమ్

ప్రియమైన ప్రేమ ( TELUGU PREMIKULA KAVITHALU )

                            ప్రియమైన బుజ్జి
నీ వల్లే నా బాధలు చేశాయ్ వనవాసం,
నీ నవ్వుల చెలిమితొ చెరసాల కి చేరిందే నా బాదల గతం.

నీ మాటల వేనువుతోనడిచొచ్చిందే వసంతం,
నీ ప్రేమల కొలిమితో పూరివిప్పిందే నాలో ఆనందం.

నీ అడుగుల తాకిడితో నా మనసు అలజడులకు వచ్చిందే స్వాతంత్రం,
నీ పెదవుల మధురిమలే నా శ్వాసను చేశాయ్ ఓ తంత్రం.

నీతో వేసే ప్రతి అడుగు చంపేసిందే నా కలల ఆకలిని,
నీ చూపుల వర్షం తో నింపావు నా నవ్వుల సరస్సుని.

నీతో మాట్లాడే ప్రతి క్షణము మరిచానే ఈ లోకాన్ని,
నీవొచ్చి అందించావు నా చీకటి జీవితానికి రంగుల దీపావాళిని.

నీవొచ్చి అద్ధావు నా ముద్దుల రంగవల్లికలకు అందమైన రంగులని,
నీ ఆలోచనలు నా ఈ తొలి కవితకు పోసేను ప్రాణాన్ని.
నీతో ఇన్నాళ్ళ ఈ పయనం కలిగించింది నాకెంతో ఆనందాన్ని ..
.
.
.
.
Srikanth Gudimella......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...