Sunday, July 12, 2015

మనకవితలు టీమ్

నిశ్శబ్ద..మౌనమా ...!!! ( telugu new kavitha 2015)

నిశ్శబ్దం .... నిశ్శబ్దం ....
కమ్ముకు ఒచ్చె మబ్బుల్లో దాగున్న నీరు..... నిశ్శబ్దం ...
ఉప్పెంగి నింగికి ఎగాసే సంద్రం ... నిశ్శబ్దం ...
హోరు హోరు వీచే గాలిలో నిశ్శబ్దం .......
దట్టమైన అడవుల్లో ఊగే చెట్లు సైతం నిశ్శబ్దం ....

కట్టలు తెంచుకొని పరవళ్ళు తొక్కే నదీ నదాల్లో నిశ్శబ్దం....
ఇంతలా ఆవరించిన నిశ్శబ్దం ఎందుకు ...ఎందుకు ???
క్షణం కూడా భరించలేని ఆ నిశ్శబ్దాన్ని పంచభూతాలు సైతం ఎందుకు నిశ్సబ్దంగా ఆలకిస్తున్నయి...??
ఎప్పుడు చిలిపిగా .... సంతోషం గా ... శబ్దం తప్ప ... నిశ్శబ్దం ఎరుగని.... గువ్వలాంటి అల్లరి మనస్సు ...
మౌనంగా ..... జ్యోతి లేని అంధకారంలో ... విలపించే కన్నీరు ఏరులయి పారుతుంటే ...
ఎన్నో శారద రాత్రులు నిశ్శబ్దం ఒడిలో తల మోడ్చి కళ్ళు బరువెక్కిన నిశ్శబ్ద తరుణంలో .....
శ్రుతి గతి తప్పి సందిగ్దంలో ఉన్న నిశీధ తరుణంలో ....
నిశ్శబ్దం ...నిశ్శబ్దం గా శిరస్సు ఒంచి కైమోడ్చి ప్రణమిల్లి చూస్తోంది ...
అందుకే ..ఈ ప్రకృతి విలయ స్తంభన....!!!
మౌనమా ..! ఓ ...మౌనమా ..!
విడు .... విడు ... నీ మౌనం ....వీడి నీ ఉనికి నీవే చాటుకో!!!
ప్రదూష కిరణాల రంగ వల్లుల హరివిల్లుల సంగమంలో నీ మౌనానికి వీడ్కోలు థెలిపి... నీ జీవన యానం సాగించు...!!
ఎందుకంటే .... నిశ్శబ్దం బరువేక్కివ గుండెతో ..నీవు వేసే ఆడుగులో....తోడు ఎవరు లేరమ్మ ...
నీకు నీవే... నేస్తమా !!!
ఇది గమ్యం లేని ప్రయాణం ....నీ జీవితం అంతులేని కధనం !!!!!
.
.
.
.
.
మైలవరపు నాగ రంగ జ్యోతి.........

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments
July 12, 2015 at 2:20 AM delete

జ్యోతి గారు..... మీరు రాసిన కవిత్వం ..... నా కన్నీటి బాదకు త్రుప్తి నిచ్చినది...

Reply
avatar
Anonymous
AUTHOR
September 18, 2015 at 6:11 AM delete

Nishabdha kathanam super

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...